Car Dashboard God Idols: కారు డ్యాష్‌బోర్డ్‌పై విగ్రహాలు పెడుతున్నారా... ఈ నియమాలు పాటించకుంటే యమపాశమే

కారు డ్యాష్‌బోర్డులో విగ్రహాలు పెట్టినపుడు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి.

Balachander
Published on: 22 May 2026 10:18 AM IST
Car Dashboard God Idols: కారు డ్యాష్‌బోర్డ్‌పై విగ్రహాలు పెడుతున్నారా... ఈ నియమాలు పాటించకుంటే యమపాశమే
X

Car Dashboard God Idols: మనం సొంతంగా కారు కొనుగోలు చేసిన వెంటనే మొదటగా చేసేపని డ్యాష్‌బోర్డ్‌పై తమకు ఇష్టమైన దేవుడి విగ్రహాన్ని పెట్టడం. ఎందుకంటే ప్రయాణంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా, ప్రమాదాలు జరగకుండా ఆ భగవంతుడు కాపాడతాడని చెబుతాం. అయితే, విగ్రహాలను కారులో పెట్టుకునేటప్పుడు కొన్ని కఠినమైన నియమాలు పాటించాలని జ్యోతిష్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్యాష్‌బోర్డుపై దేవుడి విగ్రహాన్ని పెట్టి నియమాలను ఉల్లంఘిస్తే శుభ ఫలితాలకు బదులుగా తీవ్రమైన దోషాలు, ప్రమాదాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. దేవుడి విగ్రహం పెట్టినపుడు కారు కేవలం ప్రయాణ సాధనంగా కాకుండా నడిచే దేవాలయంగా మారుతుంది. ఆ విధంగా భావించి నియమాలు పాటిస్తే ఆ దైవశక్తి మనల్ని రక్షిస్తుంది. మరి ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ఏ విగ్రహం పెట్టాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడానికి శ్రీ విఘ్నేశ్వరుని విగ్రహం కారులో ఉంచడం అత్యంత శ్రేష్ఠం. గణనాథునితో పాటు సంకటమోచనుడైన హనుమంతుని విగ్రహాన్ని కూడా ఉంచవచ్చు. ఈ ఇద్దరు దేవతలు ప్రయాణంలో మనకు రక్షణ కవచంలా నిలుస్తారు. ప్రయాణంలో ఇష్టదైవం విగ్రహం పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవడంలో ఎలాంటి తప్పులేదు. కానీ, హనుమంతుడు లేదా విఘ్నేశ్వరుడి విగ్రహం తప్పకుండా ఉంచుకోవాలని పండితులు చెబుతున్నారు.

పాటించవలసిన ముఖ్యమైన నియమాలు

కారు ప్రయాణంలో వ్యసనాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అంటే కారు డ్యాష్‌బోర్డుపై దేవుడి విగ్రహం ఉన్నప్పుడు అందులో ఎట్టిపరిస్థితుల్లో కూడా ధూమ, మద్యపానం చేయకూడదు. కారులో మత్తు పదార్థాలను రవాణా చేయడం కూడా మహాపాపంగా పరిగణించబడుతుంది. అదేవిధఃగా భగవంతుడు కొలువైన కారులో మాంసాహారం భుజించకూడదు. ఇలా చేయడం వలన దైవనింద చేసిన పాపం తగులుతుంది. దేవాలయంలోని గర్భగుడిని ఎంత పవిత్రంగా చూస్తామో, కారు డ్యాష్‌బోర్డును కూడా ప్రతి రోజూ ఉదయం శుభ్రంగా గుడ్డతో తుచుకోవాలి. విగ్రహానికి మురికి పడితే ప్రతికూల శక్తులు కారులో పెరిగిపోతాయి. అంతేకాదు, కారులో ఉంచే విగ్రహం ప్రయాణికులకు అభిముఖంగా లేదా కారు ముందుకు వెళ్లే దిశగా ఉంచుకోవాలి. కారులో విగ్రహాలు ఊగడం వంటివి చేయకూడదు.

నడిపే కారును ఒక పవిత్రమైన స్థలంగా భావించి, నియమాలను పాటిస్తే.. ఆ భగవంతుని అనుగ్రహం వల్ల ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రయాణం సురక్షితంగా సాగుతుంది. భక్తితో పాటు కాస్త బాధ్యత కూడా తోడైనప్పుడే ఆ దేవుడి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉంటాయని జ్యోతిష్యులు స్పష్టం చేస్తున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story