Hanuman Tail Worship: హనుమంతుడికి ఇలా నమస్కరిస్తే...మీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు
హనుమంతుడి అనుగ్రహం సంపూర్ణంగా పొందాలంటే భక్తితో ఆయన పాదాలతో పాటు వాలానికి కూడా పూజ చేయడాలి. 24 రోజుల పాటు ఇలా చేయడం వలన సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది.
Hanuman Tail Worship: మనం నిత్యం పూజించే రామభక్తుడు హనుమంతుడి రూపంలో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. సాధారణంగా దేవుడికి నమస్కరించేటప్పుడు పాదాలకు దండం పెట్టుకుంటాం. కానీ, సాక్షాత్తు ఆంజనేయస్వామి అనుగ్రహంతో పాటు, జగన్మాత పార్వతీదేవి ఆశీస్సులు కూడా ఒక్కసారిగా లభించాలంటే స్వామివారి ‘వాలానికి’ నమస్కరించాలి. హనుమంతుడి తోక కేవలం శారీరక భాగం కాదు, అది అపారమైన లక్ష్మీ స్వరూపం, శక్తి పీఠం అని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ వాల పూజ విశిష్టత ఏంటో, దాన్ని ఎలా ఆచరించాలో ఇక్కడ తెలుసుకుందాం.
హనుమ వాలంలో ‘అమ్మవారి’ శక్తి!
హనుమంతుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అవతారం. సృష్టి నియమం ప్రకారం శివుడు ఎక్కడ ఉంటే అక్కడ శక్తి ఉంటుంది. స్వామివారు భూమిపైకి వచ్చేటప్పుడు, ఆ జగన్మాత తన సంపూర్ణ శక్తిని హనుమంతుడి తోకలో నిక్షిప్తం చేసింది. మహాబలశాలి అయిన భీముడు సైతం హనుమంతుడి తోకను కదపలేకపోయాడు అంటే, అందులో ఉన్నది సాక్షాత్తు ఆ ప్రకృతి శక్తి. అందుకే హనుమద్ వాలం చివరన గంటను అలంకరిస్తారు. ఆ గంట నాదం సకల నకారాత్మక శక్తులను దూరం చేస్తుంది.
24 రోజుల వాల పూజా విధానం
మనసులో ఏదైనా బలమైన కోరిక ఉన్నప్పుడు, లేదా గ్రహదోషాలు వేధిస్తున్నప్పుడు ఈ 24 రోజుల విశేష అనుష్ఠానాన్ని భక్తులు పాటిస్తారు. ఇంట్లో హనుమంతుడి తోక పైకి తిరిగి, చివరన గంట ఉన్న ఫోటోను పూజా మందిరంలో ఉంచుకోవాలి. ప్రతిరోజూ ఉదయం స్నానాది కార్యక్రమాలు ముగించుకుని, స్వామివారి తోక మొదలు నుండి చివర వరకు కుంకుమ లేదా సింధూరంతో బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టే సమయంలో ఓం హం హనుమతే నమః అని లేదా హనుమాన్ చాలీసా పఠించాలి.
ఈ 24 రోజులు నిష్టగా, ఒకే సంకల్పంతో పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల అటు శివాంశ సంభూతుడైన హనుమయ్య, ఇటు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి కరుణ కలిసి వచ్చి, అనుకున్న కార్యం నిరాటంకంగా నెరవేరుతుంది. భజరంగ్ బలిని తలచుకుంటేనే గుండెల్లో ధైర్యం పెరుగుతుంది. అందుకే ఇకపై మీరు హనుమంతుడి ఆలయానికి వెళ్లినా, లేదా ఇంట్లో పూజ చేసినా స్వామివారి పాద పద్మాలతో పాటు, ఆ తల్లి కొలువై ఉన్న వాలానికి కూడా భక్తితో నమస్కరించండి. స్వామివారి అనుగ్రహాన్ని పొందండి.




