Elephant Statue: మన పెద్దలు చేసినట్టుగా ఇంట్లో ఏనుగు బొమ్మను పెట్టుకుంటున్నారా... మీదే అదృష్టం

మన పెద్దలు చెప్పినట్టుగా ఇంట్లో ఏనుగు బొమ్మలను ఉంచుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా జ్ఞానం, ఐశ్వర్యం, సంతోషం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

Balachander
Published on: 30 July 2026 11:40 AM IST
Elephant Statue: మన పెద్దలు చేసినట్టుగా ఇంట్లో ఏనుగు బొమ్మను పెట్టుకుంటున్నారా... మీదే అదృష్టం
X

Elephant Statue: హిందూ సంప్రదాయంలోనూ, వాస్తు శాస్త్రంలోనూ ఏనుగుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏనుగు భక్తికి, ఐశ్వర్యానికి, గజలక్ష్మి కటాక్షానికి, అపారమైన జ్ఞానానికి ప్రతీక. మన పూర్వీకులు ఇంట్లో ఏనుగు బొమ్మలను లేదా విగ్రహాలను ప్రతిష్ఠించుకోవడం వెనుక గొప్ప వాస్తు రహస్యం దాగి ఉంది. వాస్తు శాస్త్రం, ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో ఏనుగు బొమ్మలను ఉంచడం వల్ల కలుగు పలు ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వెండి ఏనుగు బొమ్మ ... ఆర్థిక సమస్యల నివారణ

వెండితో తయారు చేసిన ఏనుగు విగ్రహం చిన్నదైనా, పెద్దదైనా గృహంలో ఉంచడం అత్యంత శుభప్రదం. అదేవిధంగా, ఏనుగు బొమ్మను సంపదకు అధిపతియైన కుబేరుడి స్థానమైన ఉత్తర దిశలో లేదా దేవుడి గదిలో ఉంచితే వాస్తు దోషాలు తొలగి, ఆర్థిక ఇబ్బందులు నశిస్తాయి. ఇక కార్యాలయాల విషయానికి వస్తే, ఆఫీసు టేబుల్‌పై వెండి ఏనుగును ఉంచడం వల్ల ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో అపారమైన అభివృద్ధి లభిస్తాయి. పూర్వం రోజుల్లో చిన్ని చిన్న ఆఫీసుల్లో కూడా తప్పకుండా వాస్తు నియమాలు పాటించేవారు. కాబట్టి చిన్న వ్యాపారమైన అపారమైన విజయాలు లభించాయని పండితులు చెబుతున్నారు.

తొండం ఎత్తి ఉన్న ఏనుగులు ... విజయ సంకేతం

ఏనుగు విగ్రహం ఎంచుకునేటప్పుడు దాని తొండం పైకి ఎత్తి ఉందో లేదో గమనించాలి. పైకి ఎత్తి ఉన్న తొండం విజయానికి, అదృష్టానికి సూచికగా భావిస్తారు. జంట ఏనుగులను ప్రధాన ద్వారం వద్ద ఉంచాలి. ఈ జంట ఏనుగులు లోపలికి చూస్తున్నట్టుగా ఉంటే దుష్టశక్తులు రాకుండా రక్షణగా ఉంటాయని, అదృష్టానికి చిహ్నంగాను భావిస్తారు. ఇత్తడితో చేసిన ఏనుగు బొమ్మలు లేదా ఏనుగు పెయింటింగ్‌లను పడకగదిలో ఉంచడం వలన దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఒకరిపై ఒకరికి విశ్వాసం పెరుగుతుంది. పిల్లల గదిలో తల్లి పిల్లల ఏనుగుల చిత్రాలను ఉంచాలి. ఇలా చేయడం వలన ఏకాగ్రత, బుద్ధి కుశలత, జ్ఞానాభివృద్ధి పెరుగుతుంది.

నెగెటివ్ ఎనర్జీకి చెక్ ... కుటుంబ సమైక్యత

ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఏనుగు బొమ్మలు ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. హాల్‌లో లేదా లివింగ్ రూమ్‌లో వీటిని ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గి శాంతిసౌఖ్యాలు నెలకొంటాయి. అంతేకాదు, విఘ్నేశ్వరుడి ప్రతిరూపంగా భావించే గజరాజు బొమ్మ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉంటే ఎలాంటి విఘ్నాలు ఎదురవ్వవు. క్లుప్తంగా చెప్పాలంటే...మన ఇంటి సరిహద్దులలో సరైన దిశలో ఏనుగు బొమ్మలను ఉంచడం వలన, గజలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story