Deepa Aradhana Mistakes: దీపారాధనలో నూటికి 90 శాతం మంది చేసే తప్పులు...

మీ ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తున్నారా... అయితే, మీ ఇల్లు స్వర్గసీమగా మారుతుంది. కానీ, ఎట్టిపరిస్థితుల్లో కూడా ఈ తప్పులు చేయకూడదు.

Balachander
Published on: 9 July 2026 8:17 AM IST
Deepa Aradhana Mistakes: దీపారాధనలో నూటికి 90 శాతం మంది చేసే తప్పులు...
X

Deepa Aradhana Mistakes: సనాతన ధర్మంలో నిత్య దీపారాధనకు పరమ పవిత్రమైన ప్రాధాన్యత ఉంది. దీపో రక్షతి రక్షితః అంటారు పెద్దలు. దీపాన్ని పూజిస్తే ఆ దీపలక్ష్మి మనల్ని రక్షిస్తుందని పెద్దల మాట. అయితే, ప్రస్తుతం నిత్య పూజ చేసేవారిలో నూటికి 90 శాతం మంది తెలియకుండా కొన్ని చిన్నచిన్న తప్పులు చేస్తూ, పూజా ఫలాన్ని పూర్తిగా కోల్పోతున్నారు. దీపారాధన ఎప్పుడు చేయాలి, ఏ నూనె వాడాలి, ఎన్ని ఒత్తులు వేయాలనే విషయంలో శాస్త్రోక్తమైన నియమాలను పాటించకపోవడమే ఇందుకు కారణం. ఈ నియమాలను సరైన పద్ధతిలో తెలుసుకుని ఆచరిస్తేనే గృహంలో లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పడుతుంది. మరి ఆ నియమాలు ఏమిటో...ఎక్కడ మనం తప్పులు చేస్తున్నామో తెలుసుకుందామా.

దీపారాధనలో పాటించవలసిన నియమాలు

మన పురాణాలు, ధర్మశాస్త్రాలు నిర్దేశించిన ప్రకారం.. గృహస్థులు దీపం వెలిగించేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అందులో మొదటిది సమయపాలన. దీపారాధన ఎప్పుడైనా సూర్యోదయానికి ముందే పూర్తి చేయాలి. ఒకవేళ ఆ సమయానికి వీలుకాకుంటే కనీసం ఉదయం 7 గంటలలోపు పూర్తి చేయాలి. సాయంత్రం సమయంలో దీపారాధన ప్రదోషకాలంలో చేయడం అత్యుత్తమం. ఇక రెండో నియమం...వారాలు. మంగళ, శుక్రవారాల్లో ఇంట్లో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. మంగళవారం దీపాన్ని వెలిగించడం వలన జాతక దోషాలు, అశుభ దోషాలు తొలగిపోతాయి. శుక్రవారం లక్ష్మీప్రదమైన సమయం కాబట్టి ఆరోజు దీపం వెలిగిస్తే అష్టైశ్వరాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మూడోది ముఖ్యమైన నియమం రాత్రి 9 గంటలు దాటిన తరువాత ఇంట్లో వెలుగుతున్న దీపాన్ని స్వయంగా ఆర్పడం చేయకూడదు. ఇలా చేయడం వలన ఇంట్లో దారిద్య్రం తాండవిస్తుంది.

ఒత్తులు ... నూనెల శాస్త్రోక్త విశ్లేషణ

దీపారాధనకు ఆవునెయ్యి, నువ్వుల నూనె లేదా ఐదు రకాల నూనెలు కలిపిన పంచదీప తైలం పరమ శ్రేష్ఠం. ఏక ఒత్తితో దీపం వెలిగిస్తే సాత్విక బుద్ది కలుగుతుంది. అదే విధంగా రెండు ఒత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబంలో సౌఖ్యం, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మూడు లేదా ఏడు ఒత్తులతో దీపం వెలిగిస్తే సకల సంపదలు కలుగుతాయి. పితృదోషాలు తొలగిపోతాయి. వంశం వృద్ది చెందుతుంది.

తలకు నూనె రాసుకున్న వెంటనే లేదా శారీరక అపవిత్రత ఉన్నప్పుడు, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు దీపానికి దూరంగా ఉండాలి. దీపం వెలిగించిన తర్వాత కనీసం 30 నిమిషాల పాటు అది కొండెక్కకుండా, గాలికి ఆరిపోకుండా చూసుకోవడం గృహిణుల కనీస ధర్మం. ఈ చిన్న నియమాలు పాటిస్తూ భక్తితో ప్రమిదను వెలిగిస్తే, మీ ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది. మరి మీరు కూడా ఇలాంటి నియమాలు పాటిస్తున్నారా... మీ ఇల్లు స్వర్గసీమ అవుతుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story