Temple Darshan: గుడిలోకి వెళ్లి మూలవిరాట్‌ను చూడగానే 95శాతం భక్తులు ఇలా చేస్తారు...ఇది ముమ్మాటికీ తప్పే

గుడిలో మూలవిరాట్ దర్శనం సమయంలో భక్తులు చేసే సాధారణ తప్పులు ఏమిటి? స్వామివారిని ఎలా దర్శించుకోవాలి, కళ్లు మూసుకోవడం ఎందుకు మంచిది కాదని పండితులు చెబుతున్నారో తెలుసుకుందాం.

Balachander
Published on: 6 Jun 2026 9:39 AM IST
Temple Darshan: గుడిలోకి వెళ్లి మూలవిరాట్‌ను చూడగానే 95శాతం భక్తులు ఇలా చేస్తారు...ఇది ముమ్మాటికీ తప్పే
X

Temple Darshan: మనలో నూటికి 90 శాతం మంది గుడికి వెళ్తుంటారు. ఇష్టదైవాన్ని, కులదైవాన్ని దర్శించుకునేందుకు ఆలయాలకు వెళ్తుంటారు. ఆలయంలోకి వెళ్లగానే ముందుగా ధ్వజస్తంభానికి దణ్ణం పెట్టుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. ఆ తరువాతే గర్భగుడిలో కొలువైన స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తాం. ఎంతో కష్టపడి ఆలయానికి వెళ్లిన తరువాత స్వామివారి ముందు నిలబడి మనకు తెలియకుండానే ఓ చిన్న తప్పు చేస్తాం. ఇలా చేయడం వలన గుడికి వెళ్లినా ఫలితం ఉండదని పండితులు చెబుతున్నారు. నూటికి 95 శాతం మంది ఇలానే ఈ చిన్న తప్పు చేస్తుంటారని పండితులు చెబుతున్నారు. మరి ఆ తప్పేంటో తెలుసుకుందామా.

మూలవిరాట్‌కు ఎదురుగా నిలబడకూడదు

పెద్ద పెద్ద ఆలయాల్లో మనకు మూలవిరాగ్‌ విగ్రహానికి ఎదురుగా క్యూలైన్లో వచ్చేందుకు కమ్మీలు ఏర్పాటు చేస్తారు. అంటే మూలవిరాట్‌కు ఎదురుగా నిలబడి ఆయన్ను దర్శనం చేసుకోకూడదు. ఒక పక్కకు ఉండి మాత్రమే ఆ స్వామిని దర్శించుకోవాలి. కొన్ని ఆలయాల్లో మనకు ఇలాంటి ఏర్పాట్లు ఉండవు. అలాంటప్పుడు కూడా పక్కన నిలబడి దర్శించుకోవాలే తప్పించి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదు. ఇలా చేయడం అపచారమని పండితులు చెబుతున్నారు.

కళ్లుమూసుకోకూడదు..కారణం ఇదే

గర్భగుడిలోకి అడుగుపెట్టిన వెంటనే ఎదురుగా కనిపించిన స్వామిని చూసి గబక్కున కళ్లు మూసుకొని చేతులు జోడిస్తాం. మన మనసులోకి కోరికల చిట్టాను విప్పేస్తాం. ఇలా ఎప్పటికీ చేయకూడదు. స్వామివారు ఎదురుగా ఉన్నారంటే ఆయన్ను కళ్లు మూసుకొని కాకుండా తదేకమైన దృష్టితో స్వామివారిని చూడాలి. ఆయన రూపాన్ని మన మనసులో భద్రపరుచుకోవాలి. మూలవిరాట్‌ రూపలావణ్యాలను చక్కగా వర్ణించాలి. స్వామిని చూస్తూ ఆయన్ను మనం ఎంత గొప్పగా భావన చేస్తే అంతగా ఆయన పొంగిపోతాడు. ఈ భావన పోగడ్తల రూపంలో కాదు... ఆయనను వర్ణించే విధానంలోనే ఉండాలి. గర్భగుడిలో ఒకనిమిషం ఉన్నారా లేక రెండు నిమిషాలు ఉన్నారా అన్నది ముఖ్యం కాదు. ఉన్నంతసేపు కళ్లు మూసుకోకుండా స్వామినే చూస్తుండాలి. అచంచలమైన భక్తితో ఆయన్ను భావన చేయాలి. ఆ తరువాత బయటకు వచ్చి మౌనంగా కూర్చొని ఆయన రూపాన్ని స్మరణ చేసుకోవాలి. ఆ స్మరణలో ఆయన రూపం మనకు స్పష్టంగా కనిపిస్తే మన భక్తి నిజమైనట్టు. అలా కాకుండా అలజడితో గందరగోళంగా మారి వివిధ రూపాలు స్మరణలోకి వస్తే...ఆయన్ను సరిగా దర్శనం చేసుకోలేకపోయామని అర్థం చేసుకోవాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story