Kumbha Purnima: జీవితాన్ని మార్చే కుంభపౌర్ణమి... ఈరోజున సింపుల్‌గా ఇలా చేయండి
జులై 29 కుంభ పౌర్ణమి సందర్భంగా కోరికలు, ఆర్థిక సమృద్ధి, మానసిక ప్రశాంతత కోసం పాటించే సులభమైన ఆధ్యాత్మిక పరిహారాలు, మానిఫెస్టేషన్ ఆచారాలు, సంపద ఆకర్షణ నమ్మకాలు తదితర వివరాల గురించి తెలుసుకుందాం.
Kumbha Purnima: చంద్రుడి గమనంలో ప్రతి పౌర్ణమి పవిత్రమైనదే. అయితే, ఈ ఏడాది జులై 29న కుంభ రాశిలో సంభవించే పౌర్ణమి అత్యంత దివ్యమైనది, శక్తివంతమైనది! రాబోయే గ్రహణాల సీజన్‌కు ముందు వచ్చే చివరి పౌర్ణమి కావడం, చంద్రుడు ప్లూటోతో జతకట్టడం, రవి-గురు గ్రహాలు గ్రహ మండలంలో అత్యుత్తమ స్థితిలో కొలువుదీరడం వల్ల ఈ రోజున విశ్వం నుంచి అపారమైన దైవిక శక్తులు ప్రసరిస్తాయి. మనస్సులోని భారాలను తొలగించుకుని, లక్ష్మీదేవి కటాక్షాన్ని, అష్టఐశ్వర్యాలను ఆకర్షించేందుకు ఈ కుంభ పౌర్ణమి నాడు ఆచరించాల్సిన మూడు సులువైన దివ్య పరిహారాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఇష్టకామ్యసిద్ధికోసం
ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నారో ప్రశాంతంగా కళ్లు మూసుకుని ధ్యానించండి. మీ కోరికలు నెరవేరినట్లు భావిస్తూ, ఒక కాగితంపై "నాకు సకల ఐశ్వర్యాలు లభించాయి" అని వర్తమాన కాలంలో రాయండి. పౌర్ణమి వెన్నెల పడే సమయంలో ఇంటి కిటికీని కాస్త తెరచి, ఆ కాగితాన్ని అక్కడ ఉంచండి. దివ్యమైన పౌర్ణమి గాలులు మీ సంకల్పాన్ని విశ్వానికి చేరవేసి కోరికలను నెరవేరుస్తాయి. ఇది వినడానికి కొంత వింతగా ఉన్నా...విశ్వశక్తి ఈ దీనిని నిజం చేస్తుందని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు. విశ్వశక్తిని నమ్మేవారు ఇలాంటి వాటిని తప్పకుండా చేస్తుంటారు.
కష్టాల నుంచి విముక్తి...
గత జ్ఞాపకాలు, బాధల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ తంత్రం ఎంతో మేలు చేస్తుంది. రెండు తెల్లటి ప్రమిదలు లేదా కొవ్వొత్తులను తీసుకుని, వాటి మధ్య ఒక దారంతో ముడి వేయండి. రెండు ప్రమిదలలో దీపాలు వెలిగించండి. దీపపు జ్వాలలు ఆ దారాన్ని కాల్చేస్తున్నప్పుడు, మీలోని పాత బాధలు, రుణ బాధలు సమసిపోతున్నట్లు భావించండి. మనలోని కష్టాలు, బాధలు అనేవి కొంతకాలం మాత్రమే ఉంటాయని, అవి నిరంతరం ఉండవని, ఏదో ఒకరోజు బాధలు దారం మాదిరిగానే కాలిబూడిదైపోతాయని దీని అర్థం.
స్నానానంతరం సంపద ఆకర్షణ కోసం ఇలా చేయండి
పౌర్ణమి రాత్రి పవిత్ర స్నానం చేసిన అనంతరం, స్నానపు గది గోడలపై ఆవిరి ద్వారా ఏర్పడిన నీటి చుక్కలపై ‘888’ అనే దివ్య సంఖ్యను వేలితో రాయండి. ఈ అంకె అపారమైన లక్ష్మీ కటాక్షానికి, అంతులేని సంపదకు ప్రతీక. ఆ తర్వాత బయటకు వస్తూ మీరు నూతన ఐశ్వర్య లోకంలోకి అడుగుపెడుతున్నట్లు భావించండి. మనలో అనుకూల శక్తులు ప్రవేశించినపుడు తప్పకుండా నెగెటీవ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో మనం ఏమి కోరినా జరుగుతుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం.
అంతేకాదు, ఒకవేళ మొక్కలను ప్రేమగా పెంచే అలవాటు ఉంటే, ఒక చిన్న కుండీలో రెండు మూడు ఇత్తడి లేదా వెండి నాణేలను ఉంచి, మొలకెత్తిన బంగాళాదుంపను నాటండి. ఆ మొక్క ఏ విధంగానైతే పెరుగుతుందో, మీ ఇంట్లో సంపద కూడా అలాగే పెరుగుతుందని నమ్ముతారు. మొక్కను ఎండిపోకుండా చూసుకోవాలి. ఈ పవిత్ర కుంభ పౌర్ణమి రోజున అచంచలమైన నమ్మకంతో ఈ పరిహారాలు ఆచరించి, విశ్వం అందించే దివ్య శక్తిని, భగవంతుని పూర్ణ అనుగ్రహాన్ని పొందాలని పండితులు చెబుతున్నారు.
గమనికః ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం నమ్మకాలను అనుసరించి ఇచ్చినది మాత్రమే. మ్యానిఫెస్టేషన్ పై పూర్తి వివరాలు కావాలంటే నిపుణులైన వారిని సంప్రదించండి.




