Protein Condom : ప్రోటీన్ కండోమ్స్ వచ్చేశాయ్.. జిమ్ వెళ్లే వారి కోసమేనా? ఫిట్‌నెస్ ప్రపంచంలో ఊహించని విప్లవం

Protein Condom : భారతీయ ఫిట్‌నెస్ బ్రాండ్ బీస్ట్ లైఫ్ ప్రపంచంలోనే మొదటి ప్రోటీన్ కాండమ్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది మార్కెటింగ్ స్టంటా లేక నిజమా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

CR Reddy
Published on: 31 March 2026 8:53 AM IST
Protein Condom
X

Protein Condom

Protein Condom : సాధారణంగా జిమ్‌కు వెళ్లేవారు, ఫిట్‌నెస్ ప్రేమికులు ప్రోటీన్ పౌడర్లు, ప్రోటీన్ బార్స్, షేక్స్ వాడటం మనం చూస్తుంటాం. కానీ, ఎవరైనా ప్రొటీన్ కండోమ్ గురించి విన్నారా? వినడానికే వింతగా ఉన్నా, ఒక భారతీయ ఫిట్‌నెస్ బ్రాండ్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రముఖ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, ఎంటర్‌ప్రెన్యూర్ గౌరవ్ తనేజా (ఫ్లయింగ్ బీస్ట్) నేతృత్వంలోని బీస్ట్ లైఫ్ బ్రాండ్ ఒక వినూత్నమైన, వింతైన ప్రకటన చేసింది. తాము ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రోటీన్ కండోమ్ను లాంచ్ చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. మీ నైట్ పెర్ఫార్మెన్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకోండి అంటూ ఇచ్చిన ఈ పిచ్ చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు కండోమ్స్ లో ప్రోటీన్ ఏంటి? అది ఎలా పని చేస్తుంది? అని అందరూ జుట్టు పీక్కుంటున్నారు.

మార్కెటింగ్ ట్రిక్కా.. లేక ఏప్రిల్ ఫూల్ జోకా?

ఈ ప్రకటన రాగానే సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం కురిసింది. "జిమ్ బాయ్స్ ఇక బెడ్ రూమ్ లో కూడా మజిల్ బిల్డింగ్ చేస్తారా?" అని కొందరు సెటైర్లు వేస్తుంటే, మరికొందరు ఇది ఖచ్చితంగా ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ అని కొట్టిపారేస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీకి ముందు ఇలాంటి వింత ప్రకటనలు చేసి వైరల్ అవ్వడం బ్రాండ్లకు అలవాటే. అయితే, అది ప్రాంక్ అయినా కాకపోయినా, జరగాల్సిన ప్రచారం మాత్రం గట్టిగా జరిగిపోయింది. ఫిట్‌నెస్ మార్కెట్‌లో పోటీని తట్టుకోవడానికి ఇలాంటి క్రేజీ ఐడియాతో బీస్ట్ లైఫ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

వింతైన ఫ్లేవర్లు.. విడ్డూరమైన ఐడియాలు

కండోమ్స్ విషయంలో ఇలాంటి వింతలు జరగడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో చికెన్ టిక్కా మసాలా, ఆవకాయ, పాన్, విస్కీ, బేకన్, గార్లిక్ ఫ్లేవర్లలో కూడా కాండమ్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఇవే కాకుండా, చీకట్లో మెరిసే గ్లో ఇన్ ది డార్క్ కండోమ్స్, రెయిన్బో కలర్ వేరియంట్లు కూడా ఉన్నాయి. 2024లో జర్మనీకి చెందిన బిల్లీ బాయ్ అనే సంస్థ క్యామ్‌డమ్ పేరుతో ఒక డిజిటల్ కాండమ్ యాప్‌ను కూడా తెచ్చింది. ఇది శృం*గార సమయంలో ఫోన్ కెమెరాలు వాడకుండా అడ్డుకుంటుంది.


వైరల్ అవ్వడమే అసలు లక్ష్యం

సేఫ్ సెక్స్ గురించి మాట్లాడటానికి జనం ఇప్పటికీ మొహమాటపడుతుంటారు. ఇలాంటి వింతైన లేదా హాస్యాస్పదమైన ప్రచారాల ద్వారా ఆ చర్చను సామాన్యుల్లోకి తీసుకెళ్లడం బ్రాండ్ల ఉద్దేశ్యం. బీస్ట్ లైఫ్ ప్రకటించిన ఈ ప్రోటీన్ కండోమ్ నిజంగా మార్కెట్లోకి వస్తుందో లేదో తెలియదు కానీ, గౌరవ్ తనేజా అనుకున్న పబ్లిసిటీ మాత్రం విపరీతంగా వచ్చేసింది. 2026 ఐపీఎల్ సీజన్ జోరులో, డెవాల్డ్ బ్రెవిస్ వంటి ఆటగాళ్ల అప్‌డేట్స్ మధ్య ఈ ప్రోటీన్ కండోమ్ వార్త కూడా ట్రెండింగ్‌లో నిలవడం విశేషం.

CR Reddy

CR Reddy

Next Story