Lottery: అదృష్టమంటే నీదే పాప..కళ్లు మూసి తెరిచేలోపు రూ. 1.4 కోట్లు

Lottery: రాత్రి వేళల్లో నిద్రపట్టక టైమ్ పాస్ కోసం మొబైల్ ఫోన్ చూసిన ఓ మహిళ లాటరీలో రూ. 1.4 కోట్ల భారీ జాక్‌పాట్ గెలుచుకుంది.

Naresh.k
Published on: 18 July 2026 1:52 PM IST
Lottery
X

Lottery: అదృష్టమంటే నీదే పాప..కళ్లు మూసి తెరిచేలోపు రూ. 1.4 కోట్లు

North Carolina: రాత్రి వేళల్లో ఎంతకీ నిద్రపట్టకపోతే చాలామంది చేసే పని.. మొబైల్ ఫోన్ చేతిలోకి తీసుకోవడం. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ స్క్రోల్ చేయడమో, ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు చూడటమో చేస్తుంటారు. అయితే, ఓ మహిళకు మాత్రం ఆ అర్ధరాత్రి నిద్ర రాకపోవడమే.. ఆమె తలరాతను మార్చేసింది. నిద్రరాక ఫోన్ చూసుకున్న ఆ కొద్ది నిమిషాల్లోనే ఆమె ఏకంగా కోటీశ్వరురాలైపోయింది. అమెరికాలోని నార్త్ కరోలినా, మూర్స్ విల్లే ప్రాంతానికి చెందిన సూ రౌలీకి జూలై 8వ తేదీ రాత్రి ఎంతకీ నిద్రపట్టలేదు. బెడ్‌పై అటు ఇటు దొర్లుతూ సమయం వృథా చేయడం ఎందుకని, టైమ్ పాస్ కోసం తన మొబైల్ ఫోన్ తీసుకుంది.

ఎప్పుడూ చూసే సోషల్ మీడియా జోలికి వెళ్లకుండా, సరదాగా ఆన్‌లైన్‌లో ‘నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ’ అఫీషియల్ యాప్‌ను ఓపెన్ చేసింది. అందులో కేవలం ఒకే ఒక్క డాలర్ ,భారత కరెన్సీలో సుమారు రూ. 84 పెట్టి ‘క్యాష్ 5’ అనే ఆన్‌లైన్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసి పడుకుంది. ఆ మరునాడు ఉదయం నిద్ర లేచి ఎప్పటిలాగే ఫోన్ చూసుకున్న సూ రౌలీ షాక్‌తో నోరెళ్లబెట్టింది. లాటరీ ఆఫీసు నుండి ఆమెకు ఒక ఈమెయిల్ వచ్చింది. అందులో ఆమె ఏకంగా 1,67,419 డాలర్లు అంటే మన దేశీ కరెన్సీలో సుమారు రూ. 1.4 కోట్లు జాక్‌పాట్ గెలుచుకున్నట్లు ఉంది.

మొదట ఆ మెయిల్ చూసి ఆమె అస్సలు నమ్మలేకపోయింది. ఏదో స్ప్యామ్ మెయిల్ లేదా పొరపాటు జరిగి ఉంటుందని భావించింది. కానీ, నేరుగా లాటరీ ఆఫీసుకు వెళ్లి కన్ఫామ్ చేసుకున్నాక కానీ ఆమెకు అసలు విషయం నమ్మకం కాలేదు. ఒక్క రాత్రిలో తన అదృష్టం ఇలా యూ-టర్న్ తీసుకుంటుందని ఆమె ఊహించలేదు.

రాత్రి నిద్రపట్టకపోవడం నా జీవితంలో ఇంత పెద్ద అదృష్టాన్ని తెస్తుందని అస్సలు అనుకోలేదు. అది నా లక్కీ నైట్ అని సూ రౌలీ ఆనందంతో వ్యాఖ్యానించింది. ఈ భారీ లాటరీ ప్రైజ్ మనీలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యాక్స్ డిటెక్షన్స్ అన్నీ పోనూ.. చివరికి ఆమె చేతికి సుమారు రూ. 1 కోటి రూపాయల నికర నగదు అందింది. ఈ లక్కీ మనీతో తను ప్రశాంతంగా ఉండేందుకు, తన ఇంటికి సంబంధించిన పాత అప్పులన్నింటినీ పూర్తిగా తీర్చేసుకుంటానని సూ రౌలీ సంతోషంగా వెల్లడించింది. సాధారణంగా నిద్రపోకుండా ఫోన్ చూస్తే ఆరోగ్యానికి హానికరం అంటారు కానీ, ఈమె విషయంలో మాత్రం ఆ ఫోన్ చూసే అలవాటే కోట్ల రూపాయల సిరిసంపదలను తెచ్చిపెట్టింది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story