Strange Addiction : వింత వ్యసనం.. తన గోళ్లు సరిపోక కూతురివి కూడా.!

Strange Addiction : సాధారణంగా కొందరికి ఒత్తిడిలోనో, ఖాళీగా ఉన్నప్పుడో చేతి గోళ్లు కొరకడం అలవాటు ఉంటుంది. చిన్నపిల్లల్లో ఈ అలవాటు మరింత ఎక్కువగా కనిపిస్తుంది.

G Krishna
Published on: 2 Jun 2026 1:23 PM IST
woman eating toenails
X

woman eating toenails

Strange Addiction : సాధారణంగా కొందరికి ఒత్తిడిలోనో, ఖాళీగా ఉన్నప్పుడో చేతి గోళ్లు కొరకడం అలవాటు ఉంటుంది. చిన్నపిల్లల్లో ఈ అలవాటు మరింత ఎక్కువగా కనిపిస్తుంది. కానీ, ఎవరైనా చేతి గోళ్లను కాకుండా, తమ కాలి గోళ్లను కొరికి తింటారా? అదీ ఒకటి రెండు రోజులు కాదు, ఏకంగా 26 ఏళ్లుగా ఈ అలవాటును కొనసాగిస్తున్నారంటే నమ్ముతారా? వినడానికే చాలా వింతగా, కాస్త అసహ్యంగా అనిపించినా ఇది నిజం. బ్రిటన్‌కు చెందిన ఒక మహిళకు ఉన్న ఈ వింత వ్యసనం గురించిన వివరాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

రెండేళ్ల వయసు నుంచే వింత అలవాటు

బ్రిటన్‌కు చెందిన 28 ఏళ్ల చార్లీ అనే మహిళకు ఈ వింత అలవాటు ఉంది. ఆమెకు కేవలం రెండేళ్ల వయసు ఉన్నప్పటి నుండి తన కాలి గోళ్లను నోటితో కొరికి తినడం అలవాటుగా మారింది. అంటే దాదాపు 26 ఏళ్లుగా ఆమె ప్రతిరోజూ ఈ పని చేస్తూనే ఉంది.

కూతురి గోళ్లను సైతం వదలకుండా..

చార్లీ వ్యసనం ఇక్కడితోనే ఆగలేదు. ఆమెకు ఒక కూతురు ఉంది. చార్లీ తన కూతురి చేతి , కాలి గోళ్లను కత్తిరించిన తర్వాత, ఆ గోరు ముక్కలను పారేయకుండా వాటిని కూడా నోట్లో వేసుకుని నమిలి తింటుంది. కాలి గోళ్లను కొరకడం వల్ల ఆమెకు చాలాసార్లు కాళ్లు నొప్పెట్టడం, రక్తం రావడం వంటివి జరిగాయి. అయినప్పటికీ ఆమె ఆ అలవాటును మానుకోలేకపోతోంది. గోళ్లు కొరకడం వల్ల తనకు ఒక రకమైన మానసిక ఉపశమనం లభిస్తుందని ఆమె చెబుతోంది.

వైద్యులు ఏమంటున్నారు.?

వైద్య నిపుణుల ప్రకారం.. ఇలా గోళ్లు కొరకడం , తినడాన్ని ఒక మానసిక రుగ్మతగా పరిగణిస్తారు. దీనిని వైద్య పరిభాషలో ‘ఒనికోఫాగియా’ (Onychophagia) అని పిలుస్తారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి (Stress), ఆందోళన (Anxiety), ఒంటరితనం వంటి సమస్యలతో బాధపడేవారిలో ఇటువంటి ప్రవర్తన కనిపిస్తుంది.

అయితే, గోళ్లలో అనేక రకాల బ్యాక్టీరియా, ఫంగస్ , ధూళి చేరి ఉంటాయి. వాటిని నోటి ద్వారా లోపలికి తీసుకోవడం వల్ల తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్లు, జీర్ణక్రియ సమస్యలు , నోటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చార్లీ కథనం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు ఈ వింత అలవాటును చూసి షాక్‌కు గురవుతున్నారు , ఆమె త్వరగా వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story