Viral: ప్రపంచంలోనే అత్యంత వింత ట్రాఫిక్ రూల్స్ గురించి మీరెప్పుడైనా విన్నారా?
Viral: ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న కొన్ని వింతైన ట్రాఫిక్ రూల్స్ గురించి తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
Viral: ప్రపంచంలోనే అత్యంత వింత ట్రాఫిక్ రూల్స్ గురించి మీరెప్పుడైనా విన్నారా?
Viral: సాధారణంగా మన దేశంలో ట్రాఫిక్ నిబంధనలు అంటే హెల్మెట్ పెట్టుకోవడం, సీటు బెల్టు పెట్టుకోవడం లేదా సిగ్నల్ జంప్ చేయకపోవడం లాంటివి మాత్రమే మనకు ఎక్కువగా తెలుసు. కానీ, ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న కొన్ని వింతైన ట్రాఫిక్ రూల్స్ గురించి తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆయా దేశాల్లో ఆ నియమాలను అతిక్రమిస్తే అక్కడి చట్టాల ప్రకారం భారీగా జరిమానాలు కూడా విధిస్తారట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ముఖ్యమైన వింత ట్రాఫిక్ రూల్స్ ఇవే:
స్విట్జర్లాండ్: ఇక్కడ ప్రజలు ప్రశాంతతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి అక్కడ డ్రైవింగ్ చేసేటప్పుడు చుట్టుపక్కల వారికి శబ్దం ఎక్కువగా వచ్చేలా వెహికల్ డోర్లు అస్సలు వేయకూడదు.
యూకే, జపాన్: ఈ రెండు దేశాల్లో వర్షం పడినప్పుడు రోడ్లపై డ్రైవింగ్ చేసే వాహనదారులు, పాదచారులపై నీళ్లు పడేలా వేగంగా వెళ్లకూడదు.
స్పెయిన్: ఇక్కడ డ్రైవింగ్ చేసే సమయంలో వాహనదారులు కచ్చితంగా సరైన చెప్పులు లేదా బూట్లు వేసుకోవాలి. కాలికి సరైన పాదరక్షలు లేకుండా డ్రైవింగ్ చేయడం అక్కడ నేరం.
థాయ్‌లాండ్: థాయ్‌లాండ్‌లో కనీసం పైన షర్ట్ వేసుకోకుండా రోడ్లపై నడపడం చట్ట విరుద్ధం.
సైప్రస్: ఈ దేశంలో డ్రైవింగ్ సమయంలో డ్రైవర్లు ఏదైనా తింటూ లేదా తాగుతూ వాహనం నడపకూడదు.
జర్మనీ: జర్మనీలోని ప్రఖ్యాత 'ఆటోబాన్' హైవేపై ప్రయాణించేటప్పుడు మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెహికల్ ఆపకూడదు.
ఆయా దేశాలకు వెళ్లేవారు కచ్చితంగా అక్కడి ఈ వింతైన ట్రాఫిక్ నియమాలను తెలుసుకుని డ్రైవింగ్ చేయడం మంచిది లేదంటే కచ్చితంగా భారీ ఫైన్ లేదా జైలు శిక్షలు అనుభవించాల్సిందే.




