Viral Video: పొట్టేలు మామూలుది కాదుగా.. మైండ్ గేమ్‌తో ప్రత్యర్థికి షాక్!

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తెలివైన పొట్టేలు వీడియో. ఇనుప జాలీ వెనుక ప్రత్యర్థిని నమ్మించి మోసం చేసిన వైనం. ఈ 'రాజకీయ గొర్రె' తెలివికి నెటిజన్లు ఫిదా!

Arun Chilukuri
Published on: 23 April 2026 11:49 AM IST
Viral Video
X

Viral Video: పొట్టేలు మామూలుది కాదుగా.. మైండ్ గేమ్‌తో ప్రత్యర్థికి షాక్!

Viral Video: సాధారణంగా గొర్రెలు లేదా పొట్టేళ్లు అంటే మనకు అమాయకత్వం గుర్తొస్తుంది. కానీ, ఈ మధ్య కాలంలో జంతువులు కూడా మనుషులకు మించి తెలివితేటలు ప్రదర్శిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే, గొర్రెల్లో కూడా 'రాజకీయాలు' ఉంటాయా అని ఆశ్చర్యపోక తప్పదు.

వైరల్ వీడియోలో రెండు పొట్టేళ్లు ఎదురెదురుగా ఉన్న ఇనుప గ్రిల్స్ (జాలీలు) గదుల్లో ఉన్నాయి. రెండింటి మధ్య యుద్ధం మొదలైంది. ఒకదానికొకటి కొమ్ములతో ఢీకొట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది.

అందులో ఒక పొట్టేలు తన శక్తిని మొత్తం ఉపయోగించి ఇనుప జాలీని బలంగా కొడుతుంటే, రెండో పొట్టేలు మాత్రం అత్యంత తెలివిగా ప్రవర్తించింది. అది తన తలను జాలీ వరకు తీసుకెళ్లి కొట్టినట్టు నటిస్తోందే తప్ప, అసలు బలాన్ని ప్రయోగించలేదు. అవతలి పొట్టేలును రెచ్చగొడుతూ అది మాత్రం వేడుక చూసింది. పాపం, అవతలి పొట్టేలు తన శక్తినంతా ధారపోసి కొద్దిసేపటికే అలసిపోయి సైలెంట్ అయిపోయింది.

@awkwardgoogle అనే యూజర్ ఎక్స్‌లో షేర్ చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. "గొర్రెల్లో కూడా రాజకీయ గొర్రెలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది" అని ఒకరు కామెంట్ చేయగా.."ఇది తెలివైన మోసం.. దాని ఐక్యూ (IQ) లెవల్స్ మామూలుగా లేవు" అని మరొకరు రాసుకొచ్చారు. మొత్తానికి ఈ పొట్టేలు తన శక్తిని ఆదా చేసుకున్న తీరు చూస్తుంటే.. "బలం కంటే తెలివితేటలు మిన్న" అనే సామెత దీనికి సరిగ్గా సరిపోతుందనిపిస్తుంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story