Viral Video: 'ధర్మం చేయండి మహాప్రభూ..' అడుక్కోవడంలోనూ రోబో తగ్గేదేలే.!

Viral Video: మనిషికి ఉపాధి లేకుండా చేస్తున్న రోబోలు.. ఇప్పుడు ఏకంగా అడుక్కోవడంలోనూ పోటీకి వచ్చేస్తున్నాయి.

Ravi
By Ravi
Updated on: 14 Jun 2026 9:52 AM IST
Viral Video
X

Viral Video: 'ధర్మం చేయండి మహాప్రభూ..' అడుక్కోవడంలోనూ రోబో తగ్గేదేలే.!

Viral Video: సాంకేతికత పెరిగిపోతున్న కొద్దీ మనుషులు చేసే ప్రతి పనినీ రోబోలు భర్తీ చేస్తున్నాయి. అయితే, మనిషి తన పొట్ట నింపుకోవడానికి ఎంచుకునే చిట్టచివరి ఆప్షన్ అయిన 'భిక్షాటన'లోనూ రోబోలు కాంపిటీషన్‌కు వచ్చేలా ఉన్నాయని నిరూపించే ఒక వింత ఘటన వెలుగు చూసింది. చైనాలో ఓ రోబో వీధిలో అడుక్కుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని ఓ రద్దీగా ఉండే వీధిలో ఒక రోబో అచ్చం మనిషిలాగే మోకరిల్లి కూర్చుంది. దారిన పోయేవారిని రెండు చేతులు జోడించి దండం పెడుతూ మరీ అది భిక్షాటన చేస్తోంది. ఈ రోబో అడుక్కునే విధానం కూడా ఎంతో హైటెక్‌గా ఉంది. కేవలం క్యాష్ మాత్రమే కాకుండా, ఎవరైనా ఆన్‌లైన్ పేమెంట్స్ చేయడానికి వీలుగా తన ముందు ఒక క్యూఆర్ కోడ్‌ను కూడా పెట్టుకుని యాక్సెప్ట్ చేస్తోంది.

మనిషిలాగే దండం పెడుతూ ఆ రోబో అడుక్కుంటున్న తీరు చూసి స్థానికులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఇది నిజంగా భిక్షాటన చేయడానికి పెట్టింది కాదని, ఏదైనా టెక్నాలజీ కంపెనీ చేస్తున్న ప్రమోషన్ లేదా ప్రయోగం కావొచ్చునని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, టెక్నాలజీ భవిష్యత్తులో మరెన్ని వింతలకు దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.




Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story