Viral Video : వీళ్లు మనుషులా లేక స్పైడర్ మ్యాన్ వారసులా? రైలు దిగడానికి చేసే విన్యాసాలు చూస్తే హార్ట్ ఎటాక్ రావడం ఖాయం
Viral Video : రైలు పైకప్పు మీద ప్రయాణిస్తూ, దిగేటప్పుడు కరెంటు స్తంభాలను పట్టుకుని వేలాడుతున్న ప్రయాణికుల షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video
Viral Video : సోషల్ మీడియా అంటేనే వింతలు, విశేషాలకు కేరాఫ్ అడ్రస్. ప్రతిరోజూ ఏదో ఒక వీడియో మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంటుంది. అయితే తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం మీ కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. ప్రాణాలకు తెగించి రైలు ప్రయాణం చేయడం ఒక ఎత్తయితే.. రైలు దిగేందుకు ఆ ప్రయాణికులు ఎంచుకున్న మార్గం చూసి నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా రైలు ఆగగానే ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్ మీదకు దిగుతారు. కానీ, ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు వేరు. రైలు బోగీల లోపల చోటు లేక వందలాది మంది ప్రయాణికులు రైలు పైకప్పు మీద కూర్చుని ప్రయాణిస్తున్నారు. ఇది బంగ్లాదేశ్‌కు చెందిన రైలుగా తెలుస్తోంది. రైలు స్టేషన్‌లో ఆగినప్పుడు, లోపల ఉన్నవారు హాయిగా దిగిపోగా.. పైకప్పు మీద ఉన్నవారు మాత్రం దిగడానికి ఏకంగా పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలను, ఇనుప స్తంభాలను వాడుతున్నారు. స్తంభాన్ని గట్టిగా పట్టుకుని, గాలిలో వేలాడుతూ కిందకు జారి దిగుతున్న తీరు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
ట్విట్టర్ (X) లో @geetappoo అనే ఖాతా ద్వారా షేర్ అయిన ఈ వీడియో నిమిషాల్లోనే లక్షలాది వ్యూస్ సంపాదించింది. ప్రయాణికులు ఏమాత్రం భయం లేకుండా, చాలా అలవోకగా ఆ స్తంభాలను పట్టుకుని దిగుతున్నారు. ఒకవేళ పట్టు తప్పినా లేదా ఆ స్తంభాలకు విద్యుత్ సరఫరా ఉన్నా ఊహించని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇంతటి రిస్క్ తీసుకుని ప్రయాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది వారి రోజువారీ అలవాటులా కనిపిస్తోందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
संसाधनों की कमी है या फिर जनसंख्या विस्फोट, कहाँ की तस्वीर हो सकती है ये pic.twitter.com/kNRnqB6bBI
— Geeta Patel (@geetappoo) March 31, 2026
ఈ వీడియో ఎప్పుడు తీశారు అన్నది స్పష్టంగా తెలియకపోయినా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రైల్వే వ్యవస్థ ఎంతటి ఒత్తిడిలో ఉందో ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయి. జనాభాకు తగ్గట్టుగా రైళ్లు లేకపోవడం, పేదరికం వంటి కారణాల వల్ల ప్రజలు ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? ఇలాంటి పనులను ఎందుకు అడ్డుకోవడం లేదు? అని జనం నిలదీస్తున్నారు. ఏది ఏమైనా, ఈ వీడియో చూసిన ఎవరైనా సరే.. వీళ్ల ధైర్యానికి దండం పెట్టాల్సిందే అనక మానరు.




