Viral Video: కింగ్ కోబ్రాకే షాకిచ్చిన చిన్నారి.. దాని ముందే డ్యాన్స్ చేస్తూ ఏం చేసిందో చూడండి!

Viral Video: కింగ్ కోబ్రా ముందు ఓ చిన్నారి భయం లేకుండా డ్యాన్స్ చేస్తూ, దాన్ని ఆటపట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Arun Chilukuri
Published on: 19 Aug 2026 4:14 PM IST
Viral Video
X

Viral Video: కింగ్ కోబ్రాకే షాకిచ్చిన చిన్నారి.. దాని ముందే డ్యాన్స్ చేస్తూ ఏం చేసిందో చూడండి!

Viral Video: విషసర్పం పేరు వింటేనే జనం పారిపోతారు, అలాంటిది అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ముందే ఓ చిన్నారి ఎలాంటి భయం లేకుండా డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కింగ్ కోబ్రా వద్దకు వెళ్లిన బాలిక దాన్ని తట్టి లేపడంతో, అది కోపంతో పడగ విప్పి ఒక్కసారిగా దాడికి దిగింది.

పాము దాడి నుంచి చలాకీగా తప్పించుకున్న సదరు చిన్నారి, ఏమాత్రం బెదరకుండా దాన్ని వెక్కిరిస్తూ దాని ముందే డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. డ్యాన్స్ చేయడమే కాకుండా, ఆ విషసర్పం తోకను పట్టుకుని పైకి లేపేందుకు కూడా ఆ బాలిక ప్రయత్నించడం గమనార్హం.

సాధారణంగా చిన్న కదలికలకే కోపగించుకునే కింగ్ కోబ్రా, ఆ చిన్నారి అంతగా కవ్వించినా మళ్లీ దాడి చేయకపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇలాంటి సాహసాలు అత్యంత ప్రమాదకరమని, ఎవరూ అనుకరించవద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story