Viral Video: జై భజరంగబలి.! యూఎస్ ప్రైవేట్ జెట్‌ను కాపాడిన హనుమంతుడి.. నెట్టింట వైరల్
Viral Video: మన దేశంలో వాహనాల్లో దేవుడి బొమ్మలు పెట్టుకోవడం సర్వసాధారణం. కానీ, అమెరికాలోని ఒక ప్రైవేట్ జెట్ కాక్‌పిట్‌లో హనుమంతుడి బొమ్మ కనిపించడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
Viral Video: జై భజరంగబలి.! యూఎస్ ప్రైవేట్ జెట్‌ను కాపాడిన హనుమంతుడి.. నెట్టింట వైరల్
Viral Video: సాధారణంగా మన దేశంలో ద్విచక్ర వాహనం నుంచి కారు, బస్సు వరకు ఏ కొత్త వాహనం కొనుగోలు చేసినా అందులో తమ ఇష్టదైవమైన దేవుడి బొమ్మలు లేదా విగ్రహాలు పెట్టుకోవడం మనకు ఎప్పటినుంచో ఉన్న ఆనవాయితీ. అయితే, ఒక విదేశీ విమానంలో, అదీ అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ జెట్ కాక్‌పిట్‌లో సాక్షాత్తూ మన హనుమంతుడి బొమ్మ కనిపించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
వివరాల ప్రకారం, అమెరికాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ 'స్పీడ్' ఇటీవల ఒక ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించాడు. ఆ ప్రయాణ సమయంలో అతను సరదాగా తీసిన వీడియోలో ఫ్లైట్ పైలట్ క్యాబిన్లో అంజనేయుడి బొమ్మ వేలాడుతూ అందరికీ స్పష్టంగా కనిపించింది. ఆ హనుమంతుడి బొమ్మను చూసి భారతీయ నెటిజన్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ విమాన ప్రయాణంలో ఊహించని విధంగా ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.
విమానం వేగంగా గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో పైలట్ క్యాబిన్ అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన పైలట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే ఆ విమానాన్ని సురక్షితంగా కిందికి దించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అదృష్టవశాత్తూ ఈ పెను ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం, హాని జరగకపోవడంతో ప్రయాణికులతో పాటు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం ఈ విమాన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ కావడంతో, కాక్‌పిట్‌లో ఉన్న ఆ ఆంజనేయ స్వామే స్వయంగా ప్రయాణికులను భారీ ప్రమాదం నుంచి కాపాడాడంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తమ భక్తిని చాటుకుంటున్నారు.




