Viral Video: ఇంకెప్పుడురా అమ్మాయిలు స్వేఛ్చగా తిరిగేది.. అక్కాచెల్లెళ్లను బలవంతంగా బస్సులోకి.!

Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో పట్టపగలు నడిరోడ్డుపై ఇద్దరు అక్కాచెల్లెళ్లను కొంతమంది దుర్మార్గులు అడ్డగించి బలవంతంగా బస్సులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు.

Ravi
By Ravi
Published on: 11 July 2026 6:31 PM IST
Viral Video
X

Viral Video: ఇంకెప్పుడురా అమ్మాయిలు స్వేఛ్చగా తిరిగేది.. అక్కాచెల్లెళ్లను బలవంతంగా బస్సులోకి.!

Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ఓ షాకింగ్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. నడిరోడ్డుపై ఇద్దరు అక్కాచెల్లెళ్లను కొంతమంది వ్యక్తులు బలవంతంగా తమ బస్సులోకి ఎక్కించేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ఆ ఇద్దరు సిస్టర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వైరల్ వీడియోలో, కాలేజీలను వెతికే పని ఇద్దరు యువతులు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా, అకస్మాత్తుగా ఒక బస్సు వారి ముందు ఆగిందని తెలిపారు. అందులో నుంచి కొందరు వ్యక్తులు కిందకు దిగి, ఆ యువతులను బలవంతంగా బస్సులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. ఆ అక్కాచెల్లెళ్లు ఎంతగానో భయపడి, వారి నుంచి తప్పించుకునేందుకు గట్టిగా కేకలు వేస్తూ ప్రతిఘటించడంతో.. చుట్టుపక్కల వారు అక్కడ చేరుకున్నారు. ఇంతలో అక్కడికి ఓ పోలీస్ వ్యాన్ వచ్చేసరికి ఆ వ్యక్తులు అక్కడ నుంచి పారిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఇన్సిడెంట్ గురించి ఆ అక్కాచెల్లెళ్లు వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన నేతిజలు తీవ్ర స్థాయిలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నాగరిక సమాజంలో పగటి పూట ఆడపిల్లలకు రక్షణ కరవైనప్పుడు, చట్టాలు ఎన్ని కఠినంగా ఉన్నా ఎలాంటి ఉపయోగం ఉండదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మహిళల రక్షణ కోసం స్పెషల్ పెట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, ఇలాంటి అరాచక ఘటనలు కేవలం యూపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై మరోసారి ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. చదువుకుని సమాజంలో ఎంతో ముందుకు వెళ్తున్న ఆడపిల్లలకు బహిరంగ ప్రదేశాల్లో కనీస రక్షణ లేకుండా పోవడం చాలా సిగ్గుచేటు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మహిళలకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతో ఉంది. కేవలం ప్రభుత్వాలు, పోలీసులు మాత్రమే కాకుండా పౌర సమాజం కూడా ఇలాంటి ఘటనలపై తక్షణమే తీవ్రంగా స్పందించాలని మేధావులు చెబుతున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story