Viral Video: కరెంట్ కోతలు.. అర్ధరాత్రి దిండుతో యువతి రోడెక్కి ఏం చేసిందో చూస్తే..

Viral Video: గత రెండు వారాలుగా పదే పదే కరెంటు పోతుండటంతో విసిగిపోయిన ఒక యువతి ఏకంగా అర్ధరాత్రి తన దిండు తీసుకుని..

Ravi
By Ravi
Published on: 11 Jun 2026 1:26 PM IST
Viral Video
X

Viral Video: కరెంట్ కోతలు.. అర్ధరాత్రి దిండుతో యువతి రోడెక్కి ఏం చేసిందో చూస్తే..

Navi Mumbai: పగలంతా ఆఫీసులో కష్టపడి పని చేసి ఇంటికి రాగానే ప్రశాంతంగా నిద్రపోదామంటే వరుస పవర్ కట్స్‌తో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇలా కరెంటు కోతలతో విసిగిపోయిన ఓ యువతి ఏకంగా అర్ధరాత్రి తన పడుకునే దిండు పట్టుకుని కరెంటు ఆఫీస్‌కు వెళ్లి వినూత్న నిరసన తెలిపింది.

అసలేం జరిగిందంటే?

నవీ ముంబైకి చెందిన ఈ యువతి ఒక ప్రైవేట్ ఉద్యోగిని. ఆమె ప్రతిరోజూ తన ఆఫీసు పనులు ముగించుకుని రాత్రి 11 గంటలకు ఇంటికి వస్తుంది. మళ్లీ ఉదయం 6 గంటలకే డ్యూటీకి వెళ్లిపోతుంది. అంటే ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకునేది, నిద్రపోయేది కేవలం ఆ కొద్ది గంటలు మాత్రమే. అయితే గత రెండు వారాలుగా ఆమె ఉంటున్న ఏరియాలో తరచూ కరెంటు పోతుండటంతో ఆమెకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.

సరైన నిద్ర లేకపోవడం వల్ల తన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని ఆమె విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసింది. ఆ యువతి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు, పవర్ కట్స్ సమస్య ఏమాత్రం తీరలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె అర్ధరాత్రి నేరుగా తన దిండు పట్టుకుని కరెంటు ఆఫీసుకు చేరుకుంది.

ఇంట్లో కరెంటు ఉండటం లేదు కాబట్టి, కరెంటు ఆఫీసులో అయినా తనను ప్రశాంతంగా పడుకోనివ్వాలంటూ అధికారుల ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె ఆవేదనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పాపం ఆమె పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకున్న నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.





Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story