Viral Video : మార్కెట్లోకి కొత్త కుక్కల బండి.. బుడ్డోడి టాలెంటుకు నెటిజన్లు ఫిదా

Viral Video : నాలుగు కుక్కలు కలిసి లాగుతున్న బండిపై ఒక చిన్నారి హాయిగా షికారు చేస్తున్న అరుదైన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

CR Reddy
Published on: 3 July 2026 8:35 AM IST
Dog Cart Ride
X

Dog Cart Ride

Viral Video : మనలో చాలా మంది చిన్నతనంలో ఎప్పుడో ఒకప్పుడు ఎడ్లబండి, గుర్రపు బండి మీద ప్రయాణించి ఉంటారు. ముఖ్యంగా గ్రామాల్లో ఇప్పటికీ ఇవి ప్రజల జీవితంలో ఒక భాగంగానే ఉన్నాయి. కానీ, నాలుగు కుక్కలు కలిసి ఒక బండిని లాగడం, దానిపై ఒక చిన్నారి ఎంతో హాయిగా కూర్చుని ప్రయాణించడం ఎప్పుడైనా చూశారా? వినడానికే వింతగా ఉన్న ఈ దృశ్యం నిజంగానే జరిగింది. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా ఒకవైపు ఆశ్చర్యపోతుండగా, మరోవైపు ముఖంపై నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

ఈ వైరల్ వీడియో ప్రారంభంలో ఒక చిన్న చెక్కతో చేసిన బండి కనిపిస్తుంది. మొదటి చూపులో ఇది చాలా మామూలు బండిలాగే అనిపించినా.. కెమెరా కాస్త ముందుకు వెళ్లేసరికి అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ బండిని లాగడానికి ఏకంగా నాలుగు పెంపుడు కుక్కలను కట్టారు. ఆ నాలుగు కుక్కలు ఎంతో క్రమశిక్షణతో, ఎలాంటి తొందరపాటు లేకుండా ఆ బండిని రోడ్డుపై లాక్కుంటూ ముందుకు సాగుతున్నాయి. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే.. ఆ బండిపై ఒక చిన్న బాబు ఎంతో దర్జాగా, మహారాజులా కూర్చుని చుట్టుపక్కల చూస్తూ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.

ఆ చిన్నారి ముఖంలో కనిపిస్తున్న ఆనందం, నవ్వు చూస్తే.. అతడు ఏదో ప్రత్యేకమైన లగ్జరీ వాహనంలో వెళ్తున్నట్లు ఫీల్ అవుతున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. రోడ్డుపై వెళ్తున్న ఈ వింత వాహనాన్ని, కుక్కల రైడింగ్‌ను చూసి స్థానిక పాదచారులు కూడా కాసేపు నడక ఆపేసి షాక్ అయ్యారు. చాలా మంది నవ్వుకుంటూ ఈ అరుదైన దృశ్యాన్ని ఆస్వాదించగా, మరికొందరు వెంటనే తమ మొబైల్ ఫోన్లు బయటకు తీసి ఈ క్యూట్ అండ్ క్రేజీ సీన్‌ను వీడియోలుగా రికార్డ్ చేయడం ప్రారంభించారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో fitdharmendra అనే అకౌంట్ ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు. పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే ఈ వీడియో మిలియన్ల వ్యూస్ సాధించి నెట్టింటిని ఊపేస్తోంది. వేల సంఖ్యలో నెటిజన్లు దీనికి లైకులు కొడుతుండగా.. కామెంట్ సెక్షన్‌లో నవ్వులు పూయించే కామెంట్ల వరద పారుతోంది. ఒక యూజర్ స్పందిస్తూ.. "ఇక గుర్రపు బండ్లు, ఎడ్ల బండ్ల కాలం చెల్లిపోయింది.. ఇప్పుడు అంతా కుక్కల బండ్ల జమానా నడుస్తోంది" అని రాశారు. మరొకరు.. "ఆ బాబు రైడింగ్ చాలా అల్టిమేట్‌గా ఉంది బాస్" అని కామెంట్ చేయగా.. ఇంకొకరు ఇలాంటి వింతను తన జీవితంలో మొదటిసారి చూస్తున్నానని రాసుకొచ్చారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story