Viral: ర్యాపిడో రైడర్‌కు అర్ధరాత్రి 1 గంటకు బుకింగ్.. పికప్ లొకేషన్ వెళ్లి చూడగా..
Viral: రాత్రి వేళ తల్లిదండ్రులకు తెలియకుండా ఏడేళ్ల బాలుడు సీక్రెట్‌గా ర్యాపిడో బైక్ బుక్ చేశాడు. అయితే, లొకేషన్‌కు వచ్చిన రైడర్ పరిస్థితిని అర్థం చేసుకుని చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Viral: ర్యాపిడో రైడర్‌కు అర్ధరాత్రి 1 గంటకు బుకింగ్.. పికప్ లొకేషన్ వెళ్లి చూడగా..
Viral: ప్రస్తుత రోజుల్లో పిల్లలు స్మార్ట్‌ఫోన్లు వాడటంలో ఎంత స్పీడ్‌గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఒక్కోసారి వారి తెలియని చేష్టలు తల్లిదండ్రులకు గుండెభయం తెప్పిస్తుంటాయి. తాజాగా ఓ ఏడేళ్ల పిల్లాడు రాత్రి వేళ ఇంట్లో ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా 'ర్యాపిడో' బైక్ బుక్ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఇక్కడ ఆ ర్యాపిడో రైడర్ చేసిన పని ప్రతి ఒక్కరి మనసు గెలుచుకుంటోంది.
వివరాల్లోకి వెళితే.. ఓ ఏడేళ్ల చిన్నారి అర్ధరాత్రి సమయంలో తల్లిదండ్రులకు తెలియకుండా తన చేతిలో ఉన్న ఫోన్‌లో ర్యాపిడో బైక్ బుక్ చేశాడు. లొకేషన్ ఆధారంగా ఆ చిన్నారి వద్దకు వచ్చిన ర్యాపిడో రైడర్, అక్కడ చీకట్లో ఒక చిన్న పిల్లాడు ఒంటరిగా నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. బాబును ఎక్కడికి వెళ్లాలి, ఇంట్లో వాళ్ళు ఎక్కడ అని ఆరా తీశాడు. పిల్లాడు ఒక్కడే ఇంట్లో వాళ్లకు తెలియకుండా అల్లరిగా బైక్ బుక్ చేశాడని అర్థం చేసుకున్న ఆ రైడర్, ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ రైడ్‌ను క్యాన్సిల్ చేశాడు. ఆ బాబుకు నచ్చజెప్పి సురక్షితంగా తిరిగి ఇంట్లోకి పంపించి తన బాధ్యతను చాటుకున్నాడు.
ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ర్యాపిడో రైడర్ చూపించిన సమయస్ఫూర్తికి, బాధ్యతాయుతమైన ప్రవర్తనకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. "ఆ రైడర్ స్థానంలో ఏ కిడ్నాపరో లేదా చెడ్డవాళ్లో ఉంటే పరిస్థితి ఏంటి? ఇలాంటి రైడర్లు ఉండటం సమాజానికి నిజంగా ఎంతో అవసరం" అంటూ కామెంట్ల రూపంలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అలాగే చిన్న పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్లు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గట్టిగా హెచ్చరిస్తోంది.




