Viral Video: కారుతో ఢీకొట్టి.. ఆ తర్వాత సారీ చెప్పి.! మనసులు గెలిచావ్ పో..
Viral Video: రోడ్డు ప్రమాదం చేసి పారిపోయే ఈ రోజుల్లో, ఒక వ్యక్తి చేసిన నిజాయితీ గల పని నెట్టింట వైరల్‌గా మారింది.
Viral Video: కారుతో ఢీకొట్టి.. ఆ తర్వాత సారీ చెప్పి.! మనసులు గెలిచావ్ పో..
Viral Video: నేటి స్వార్థపూరిత సమాజంలో రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగితే సాయం చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక తామే స్వయంగా ప్రమాదం చేస్తే, ఎవరికీ తెలియకుండా అక్కడినుంచి ఎలా పారిపోవాలా అని ఆలోచించే వారే ఎక్కువ. సాక్ష్యం చెప్పడానికి కూడా ప్రజలు భయపడుతున్న ఈ రోజుల్లో న్యూజిలాండ్‌లో జరిగిన ఒక సంఘటన మనుషులపై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఒక బస్సు డ్రైవర్ ప్రదర్శించిన అద్భుతమైన నిజాయితీకి సంబంధించిన ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల మనసులు గెలుచుకుంటోంది.
వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్‌లో ఒక బస్సు డ్రైవర్ పార్కింగ్ లాట్‌లో తన బస్సును పార్క్ చేసే క్రమంలో పొరపాటున పక్కనే ఉన్న ఒక కారును ఢీకొట్టాడు. ఆ సమయంలో కారులో ఎవరూ లేరు. నిజానికి అతను కావాలనుకుంటే ఎవరికీ చెప్పకుండా అక్కడినుంచి సులభంగా పారిపోయేవాడు. కానీ అతని నిజాయితీ అందుకు అంగీకరించలేదు. వెంటనే ఒక కాగితం తీసుకుని, తాను చేసిన తప్పుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతూ అందులో రాశాడు. అలాగే తన పేరు, కాంటాక్ట్ వివరాలను ఆ పేపర్‌పై రాసి కారు అద్దంపై ఉంచి వెళ్ళాడు.
ఇదిలా ఉంటే, ఈ ఘటనను దూరం నుంచి చూసిన మరో వ్యక్తి కూడా తన బాధ్యతను నిర్వర్తించాడు. ఆ యాక్సిడెంట్‌కు తానే సాక్ష్యం అంటూ తన వివరాలతో మరో లెటర్‌ను కూడా ఆ కారుపై ఉంచాడు. కారు దగ్గరకు వచ్చి ఈ రెండు లెటర్లు చూసిన ఒక ఇండియన్ స్టూడెంట్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇలాంటి నిజాయితీ పరులను చూస్తుంటే మనుషులపై, మానవత్వంపై తనకు నమ్మకం పెరుగుతోందని ఈ ఘటనను ఆ స్టూడెంట్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో ఈ అద్భుతమైన పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.




