Viral: ఇంట్లో పెళ్లాం మొట్టికాయలు వేస్తే.. 'రెండో పెళ్లాం' తిండి పెడుతుందా.? నెట్టింట రచ్చ రంబోలా.!
Viral: వ్యాపారంలో కస్టమర్లను ఆకర్షించడానికి కొందరు పెడుతున్న వెరైటీ పేర్లు చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు.
Viral: ఇంట్లో పెళ్లాం మొట్టికాయలు వేస్తే.. 'రెండో పెళ్లాం' తిండి పెడుతుందా.? నెట్టింట రచ్చ రంబోలా.!
Viral: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ వ్యాపారం చేయాలన్నా పబ్లిసిటీ చాలా ముఖ్యం. కస్టమర్లను తమ వైపు తిప్పుకోవడానికి వ్యాపారులు రకరకాల కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్‌లో కేవలం టేస్ట్‌తోనే కాకుండా, జనాలను ఆకట్టుకునేలా చిత్ర విచిత్రమైన, క్యాచీ పేర్లతో రెస్టారెంట్లు, దుకాణాలు వెలుస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి రెండు విభిన్నమైన షాపుల పేర్లు చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
తాజాగా విశాఖపట్నంలోని మర్రిపాలెం ప్రాంతంలో ఒకరు తమ ఫుడ్ జాయింట్‌కు ఏకంగా 'రెండో పెళ్ళాం' అని పేరు పెట్టారు. ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ఈ రెస్టారెంట్ పేరు చూసిన జనాలు ఆశ్చర్యపోవడమే కాదు, అందులో ఉన్న మెనూ ఐటమ్స్ చూసి మరింత ఫీల్ అవుతున్నారు. అందులో 'పప్పు అన్నం', అలాగే 'పక్కింటి పెళ్ళాం పప్పుచారు అన్నం' లాంటి ఫన్నీ పేర్లతో వంటకాలను అమ్ముతున్నారు. ఈ వింత పేర్లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట మీమ్స్ రూపంలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. "రెండో పెళ్ళాం చేతి వంట తినాలనుకునే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్" అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మరోవైపు, ఒక పాన్ షాప్ యజమాని పెట్టిన బోర్డు చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా పాన్ షాపుల్లో గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు అమ్ముతుంటారు. వీటి వల్ల ఆరోగ్యం పాడై క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలిసిందే. ఆ పాన్ షాప్ యజమాని తాను అమ్మే వస్తువుల స్వభావాన్ని బట్టి, ఎంతో నిజాయితీగా తన దుకాణానికి ఏకంగా 'ది క్యాన్సర్ హబ్' అని బోర్డు పెట్టాడు. సిగరెట్లు, పాన్ మసాలాలు వాడితే క్యాన్సర్ వస్తుందని కస్టమర్లను పరోక్షంగా హెచ్చరిస్తూనే, తన షాపుకు ఆ పేరు పెట్టుకోవడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు ఆన్‌లైన్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. వ్యాపారస్తుల క్రియేటివిటీకి హద్దులు లేకుండా పోయాయని, జనాల అటెన్షన్ డ్రా చేయడానికి వాళ్లు వాడుతున్న ఈ వ్యూహాలు నిజంగా వేరే లెవెల్ అని కామెంట్స్ చేస్తున్నారు.




