Viral News: ప్రేమికుల అత్యుత్సాహం.. బైక్‌పై యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని విన్యాసాలు.. వీడియో వైరల్!

Viral News: తిరువళ్లూర్ జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ యువకుడు తన ప్రేయసిని బైక్ మీద కూర్చోబెట్టుకుని ప్రమాదకరంగా వాహనం నడిపిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri
Published on: 27 April 2026 10:30 AM IST
Viral News
X

Viral News: ప్రేమికుల అత్యుత్సాహం.. బైక్‌పై యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని విన్యాసాలు.. వీడియో వైరల్!

Viral News: అతివేగం.. దానికి తోడు అత్యుత్సాహం వెరసి ప్రాణాల మీదకు తెచ్చుకునేలా చేస్తోంది. తిరువళ్లూర్ జిల్లా పూందమల్లి సమీపంలోని మీంజూరు-వండలూరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం ఓ యువకుడు చేసిన బైక్ స్టంట్లు కలకలం రేపాయి.

రోడ్డుపై వేగంగా వెళ్తున్న బైక్‌పై తన ప్రేయసిని ఎదురుగా ఒళ్లో కూర్చోబెట్టుకుని, ప్రమాదకర రీతిలో వాహనాన్ని నడిపాడు. చుట్టుపక్కల వాహనదారులు దీన్ని గమనించి భయాందోళనలకు గురయ్యారు. కొందరు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించగా, ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్‌లో పడేసిన ఈ జంట తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. వైరల్ వీడియో ఆధారంగా ఆ యువకుడిని గుర్తించే పనిలో పడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story