Viral IQ Puzzle: ఈ చిన్న లాజిక్‌ను కనిపెట్టగలరా?.. 15 సెకండ్లలో ఆన్సర్ చెబితే మీకంటే తోపెవరూ లేరు!

This viral IQ puzzle is challenging the internet. నెటిజన్లను బాగా ఆలోచింపజేస్తున్న ఓ ఆసక్తికరమైన పజిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Rishvik
Published on: 5 Aug 2026 7:19 PM IST
Viral IQ Puzzle
X

Viral IQ Puzzle: ఈ చిన్న లాజిక్‌ను కనిపెట్టగలరా?.. 15 సెకండ్లలో ఆన్సర్ చెబితే మీకంటే తోపెవరూ లేరు!

Viral IQ Puzzle: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో ఐక్యూ పజిల్స్, మ్యాథ్స్ ఛాలెంజ్‌లు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని పజిల్స్ క్షణాల్లోనే పరిష్కరించగలిగేవిగా ఉంటే.. మరికొన్ని మాత్రం ఎంత ఆలోచించినా సమాధానం దొరకనంత క్లిష్టంగా ఉంటాయి. తాజాగా నెటిజన్లను బాగా ఆలోచింపజేస్తున్న ఓ ఆసక్తికరమైన పజిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇది సాధారణ గణిత సమస్యలా కనిపించినా.. అసలు లాజిక్‌ను గుర్తిస్తే చాలా సులభంగా సమాధానం చెప్పవచ్చు.

ఈ పజిల్‌లో మూడు వేర్వేరు ఆకారాలు ఉన్నాయి. ప్రతి ఆకారంలో ఒక సంఖ్య ఇవ్వబడింది. ఈ సంఖ్యలను సాధారణంగా గుణించడం లేదా కూడడం లేదా తీసివేయడం చేయడం ద్వారా సమాధానం రాదు. ఇందులోని అసలు క్లూ ఆ ఆకారాల భుజాల (సైడ్స్) సంఖ్యలోనే దాగి ఉంది. ఆ చిన్న లాజిక్‌ను మీరు కనిపెట్టగలరా?. 15 సెకండ్లలో ఆన్సర్ చెబితే మీకంటే తోపెవరూ లేరు ఇక్కడ. ఒకవేళ సమాధానం రాకున్నా నిరాశ చెందల్సిన అవసరం లేదు. కింద లాజిక్‌తో సహా అర్ధమయ్యే రీతిలో ఆన్సర్ ఉంది.

# మొదటి ఉదాహరణలో త్రిభుజం (Triangle) కనిపిస్తుంది. త్రిభుజానికి 3 భుజాలు ఉంటాయి. అందులో ఉన్న సంఖ్య కూడా 3. కాబట్టి: 3 × 3 = 9 అవుతుంది.

# రెండో ఉదాహరణలో చతురస్రం (Square) ఉంది. చతురస్రానికి 4 భుజాలు ఉంటాయి. అందులో ఉన్న సంఖ్య 7. కాబట్టి: 7 × 4 = 28.

# చివరి ఉదాహరణలో షడ్భుజం (Hexagon) ఉంది. షడ్భుజానికి 6 భుజాలు ఉంటాయి. అందులో ఉన్న సంఖ్య 4. కాబట్టి: 4 × 6 = 24. ఈ పజిల్‌కు సరైన సమాధానం 24.

చాలామంది ఈ పజిల్‌ను కేవలం సంఖ్యల ఆధారంగా పరిష్కరించేందుకు ప్రయత్నించి తప్పుడు సమాధానాలు చెబుతున్నారు. అయితే ఆకారాలకు ఉన్న భుజాల సంఖ్యను గమనించినవారే సరైన లాజిక్‌ను గుర్తించి వెంటనే సమాధానం చెప్పగలుగుతున్నారు. ఇదే ఈ పజిల్‌లోని ప్రత్యేకత. ఇలాంటి ఐక్యూ పజిల్స్ కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా.. పరిశీలనా శక్తి, ఆలోచన, సమస్యను విభిన్న కోణాల్లో విశ్లేషించే నైపుణ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. మీరు కూడా ఈ పజిల్‌ను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకుని.. వారు ఎంత త్వరగా సరైన సమాధానం చెబుతారో ఒకసారి పరీక్షించండి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story