Brain Test: డెడ్ ఈజీ లాజిక్.. ఈ పజిల్‌కు 10 సెకన్లలో ఆన్సర్ చెప్పగలరా?

Brain Test: ఓ నంబర్ పజిల్ నెట్టింట వైరల్‌గా మారింది. 10 సెకన్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగితే.. మీరు నిజంగా స్మార్ట్‌ అని చెప్పుకోవచ్చు.

Rishvik
Published on: 18 Aug 2026 8:21 PM IST
Brain Test
X

Brain Test: డెడ్ ఈజీ లాజిక్.. ఈ పజిల్‌కు 10 సెకన్లలో ఆన్సర్ చెప్పగలరా?

Brain Test: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పజిల్స్, బ్రెయిన్ టీజర్లు నెటిజన్లకు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. పైకి చాలా సులభంగా కనిపించినప్పటికీ.. అందులోని లాజిక్‌ను గుర్తించడానికి కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. తాజాగా ఇలాంటి ఓ నంబర్ పజిల్ నెట్టింట వైరల్‌గా మారింది. 10 సెకన్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగితే.. మీరు నిజంగా స్మార్ట్‌ అని చెప్పుకోవచ్చు అంటూ దీనిని షేర్ చేస్తున్నారు. 100 మందిలో 90 మంది ఈజీగా ఆన్సర్ చెబుతున్నారు. మీరు కూడా సులువుగా సమాధానం చెప్పగలరో లేదో ఓసారి చూడండి.

ఇంతకీ పజిల్ ఏంటి?:

ఈ పజిల్‌లో మూడు వృత్తాలు ఉన్నాయి. మొదటి వృత్తంలో పై భాగంలో 5, 5 ఉండగా.. కింద 50 అని ఇచ్చారు. రెండో వృత్తంలో 6, 6 ఉండగా.. కింద 72 అని ఉంది. ఇక మూడో వృత్తంలో 3, 3 ఉన్నాయి. అయితే కింద ప్రశ్నార్థకం పెట్టి.. అక్కడ ఏ సంఖ్య రావాలో గుర్తించమని సవాల్ విసిరారు.

పజిల్‌ను ఇలా చూడొచ్చు:

5 × 5 → 50

6 × 6 → 72

3 × 3 → ?

మరి 3, 3 స్థానంలో సరైన సమాధానం ఏంటి?

లాజిక్‌ను గుర్తిస్తే చాలా ఈజీ:

ఈ పజిల్‌లో పెద్దగా కష్టమైన లాజిక్ ఏమీ లేదు. మొదటి రెండు వృత్తాల్లో ఇచ్చిన సంఖ్యలను గుణించి.. వచ్చిన ఫలితాన్ని 2తో గుణించాలి.

మొదటి ఉదాహరణను పరిశీలిస్తే:

5 × 5 = 25

25 × 2 = 50

అదే విధంగా రెండో ఉదాహరణలో:

6 × 6 = 36

36 × 2 = 72

మరి 3 × 3కి సమాధానం ఎంత?:

ఇప్పుడు ఇదే లాజిక్‌ను చివరి వృత్తానికి వర్తింపజేయాలి.

3 × 3 = 9

ఆ తర్వాత 9ను 2తో గుణిస్తే: 9 × 2 = 18

ఈ వైరల్ పజిల్‌కు సరైన సమాధానం 18.

10 సెకన్లలో చెప్పగలిగారా?:

ఈ పజిల్‌ను చూసిన వెంటనే కొందరు ఏదో ప్రత్యేకమైన ట్విస్ట్ ఉంటుందని భావిస్తారు. కానీ మొదటి రెండు ఉదాహరణల్లోని లాజిక్‌ను గుర్తిస్తే సమాధానం చాలా సులభంగా దొరుకుతుంది. 5 × 5 × 2 = 50, 6 × 6 × 2 = 72, కాబట్టి 3 × 3 × 2 = 18. మీరు కూడా 10 సెకన్లలోనే 18 అని గుర్తించారా?.. అయితే మీ లాజికల్ థింకింగ్ బాగున్నట్టే. ఈ పజిల్‌ను మీ స్నేహితులకు పంపించి.. వారు ఎంత వేగంగా సమాధానం చెబుతారో కూడా పరీక్షించండి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story