Viral Video : వీడు మామూలు పనోడు కాడు భయ్యా.. చదివుంటే ప్రపంచం మెచ్చే సైంటిస్ట్ అయ్యే వాడు

Viral Video : పల్లెటూరిలో పశువుల మేతను సంచిలో నింపడానికి ఒక వ్యక్తి వాడిన అద్భుతమైన దేశీ చిట్కా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రమ తగ్గించే ఈ టెక్నిక్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

CR Reddy
Published on: 5 April 2026 12:16 PM IST
Viral Video : వీడు మామూలు పనోడు కాడు భయ్యా.. చదివుంటే ప్రపంచం మెచ్చే సైంటిస్ట్ అయ్యే వాడు
X

Viral Video : మన దేశంలో పల్లెటూరి ప్రజల తెలివితేటలకు ఆకాశమే హద్దు. పెద్ద పెద్ద ఇంజనీర్లు కూడా చేయలేని పనులను మన రైతులు, పల్లె జనం తమ చిట్కాలతో చిటికెలో పూర్తి చేస్తారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మీరు కూడా ముక్కున వేలేసుకోవాల్సిందే. పశువుల మేత కోసం ఉపయోగించే గడ్డి పొట్టును సంచిలో నింపడానికి ఒక వ్యక్తి అనుసరించిన పద్ధతి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మీకు పల్లెటూరితో సంబంధం ఉంటే, అక్కడ పశుపోషణ ఎంత ముఖ్యమో మీకు తెలిసే ఉంటుంది. పశువుల కోసం మేతను నిల్వ చేయడం ఒక పెద్ద పని. సాధారణంగా ఈ మేతను భద్రపరచడానికి బట్టతో కుట్టిన పెద్ద పెద్ద సంచులను ఉపయోగిస్తారు. వీటిని కొన్ని ప్రాంతాల్లో భాంగా అని పిలుస్తుంటారు. ఈ భారీ సంచుల్లో మేత నింపడం అంటే మామూలు విషయం కాదు. చేతులతో ఎత్తి పోయాలంటే చాలా సమయం, అంతకు మించి విపరీతమైన శ్రమ అవసరమవుతుంది. కానీ, ఈ వైరల్ వీడియోలోని వ్యక్తి మాత్రం ఆ పనిని ఆటపాటగా మార్చేశాడు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తన సంచిని నింపడానికి చాలా తెలివైన పద్ధతిని వాడాడు. సంచి ఒక చోట స్థిరంగా ఉండటం కోసం ఒక చివరను తన మడమ కింద నొక్కి పట్టుకున్నాడు. సంచి రెండో వైపు భాగాన్ని తన నడుముకు ఆనించి పట్టుకున్నాడు. ఆ తర్వాత కొంచెం వంగి, తన రెండు కాళ్ల మధ్య నుంచి మేతను వెనక్కి విసురుతున్నాడు. అలా విసిరిన మేత సరిగ్గా వెళ్లి సంచిలో పడుతోంది. ఇలా చేయడం వల్ల వెన్నునొప్పి రాదు సదా, పని కూడా చాలా వేగంగా పూర్తవుతోంది. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఆ భారీ సంచిని అతడు మేతతో నింపేశాడు.

ఈ అద్భుతమైన ఐడియాను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కష్టపడటం కంటే ఇష్టపడి పనిచేయడం, తెలివితేటలు వాడటం పల్లెటూరి ప్రజలకే సాధ్యమని కామెంట్లు పెడుతున్నారు. ఇన్స్టాగ్రామ్‌లో onlyy_amarjeet అనే అకౌంట్ నుంచి షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే లక్షలాది మందిని ఆకర్షించింది. రోజూ చేసే పనిని కొత్త కోణంలో ఆలోచిస్తే ఎంత సులభమవుతుందో చెప్పడానికి ఈ వీడియో ఒక చక్కని ఉదాహరణ.

మనం చేసే పనుల్లో యంత్రాలు లేకపోయినా, మన దగ్గర ఉన్న వనరులతోనే పనిని సులభతరం చేసుకోవచ్చని ఈ వీడియో నిరూపిస్తోంది. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉండటానికి కారణం అవి సామాన్య ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండటమే. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది కదా అసలైన ఇంజనీరింగ్ అంటూ ఆ వ్యక్తిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

CR Reddy

CR Reddy

Next Story