Venu Swamy: జూనియర్ ఎన్టీఆర్ ఏపీకి నెక్ట్స్ సీఎం..వేణుస్వామి మరో సంచలనం
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి తాజా ఇంటర్వ్యూ నెట్టింట వైరల్.
Venu Swamy: జూనియర్ ఎన్టీఆర్ ఏపీకి నెక్ట్స్ సీఎం..వేణుస్వామి మరో సంచలనం
Jr NTR: ఎప్పుడు మాట్లాడినా సంచలనాలే.. ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా వివాదాలే. ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారారు. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలపై ఆయన చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుస్వామి పొలిటికల్, సినీ స్టార్లపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌లపై ఆయన చెప్పిన జోస్యం తీవ్ర చర్చకు దారితీసింది.
గతంలో పవన్ కళ్యాణ్ ముక్కుసూటి వైఖరి రాజకీయాలకు పనికిరాదని, 2024 నాటికి జనసేన పార్టీయే ఉండదంటూ నెగెటివ్ కామెంట్స్ చేసిన వేణుస్వామి.. ఇప్పుడు రూట్ మార్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడు అంటూ అభినందించారు. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని వేణుస్వామి జోస్యం చెప్పారు. తారక్ మఖ నక్షత్రంలో జన్మించారని, గతంలో జయలలిత కూడా ఇదే నక్షత్రంలో పుట్టి తమిళనాడును శాసించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే తిరుగుండదని, ఆయనే కాబోయే సీఎం అని సంచలన ప్రకటన చేశారు.
ఈ ఇంటర్వ్యూలో వేణుస్వామి దేశ, రాష్ట్ర రాజకీయ, సినీ ప్రముఖులపై వన్-లైనర్ పంచ్‌లు విసిరారు. నరేంద్ర మోదీ, ప్రభాస్, చిరంజీవి వీరి ముగ్గురినీ కారణజన్ములు అని అభివర్ణించారు. చిరంజీవి ఎంతో కష్టపడి పైకి వచ్చిన కారణజన్ముడన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ తోపు అని పొగిడిన ఆయన.. మాజీ సీఎం కేసీఆర్‌ను తెలంగాణ జాతిపిత అని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని, అలాగే శత్రువును సైతం క్షమించి ఆదుకునే గొప్ప గుణం ఉన్న నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. రామ్ చరణ్ తన వంశాన్ని నమ్ముకోకుండా కష్టపడుతున్నాడని, విజయ్ దేవరకొండ కూడా హార్డ్ వర్కర్ అని ప్రశంసించారు.
తాను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానా లేదా అనేది ఇప్పుడే చెప్పలేనని వేణుస్వామి అన్నారు. జాతక రీత్యా తనకు పొలిటికల్ యోగం ఉందని, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తనకు, తన భార్యకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయని హింట్ ఇచ్చారు. అయితే.. తనకు కింగ్ కావడం కంటే కింగ్ మేకర్ కావడమే ఇష్టమని, రాజయోగుల కంటే రాజభోగులుగా బతకడమే బెటర్ అని చెప్పుకొచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉండాలంటే డబ్బు సంపాదనే ఫస్ట్ ప్రియారిటీగా ఉండాలి. ఎవర్నీ పట్టించుకోకండి. ఇక్కడ ఎవరూ శుద్ధపూసలు లేరు. ఒక్కోసారి సైలెన్స్‌గా ఉండటం కూడా ఒక నిర్ణయమే" అంటూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితంలోని ఒక సంఘటనను గుర్తు చేశారు. అలాగే ఆడవాళ్ల మాట వింటే మీ జీవితం బాగుంటుంది అని హితవు పలికారు. రాబోయే కాలంలో భారతదేశంలో ఎవరూ ఊహించని పెను సంచలనాలు జరగబోతున్నాయంటూ వేణుస్వామి ముగించడం ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.




