Uppal Balu: నా చావుకు నువ్వే కారణం అవుతావు..బిగ్‌బాస్ నటుడిపై ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్!
Uppal Balu: బిగ్‌బాస్ 10 ‘అగ్నిపరీక్ష 2’ ఆడిషన్స్‌లో అవమానం జరిగింది అంటూ నటుడు నవదీప్‌పై విమర్శలు గుప్పించిన ఉప్పల్ బాలు. సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్.
Uppal Balu: నా చావుకు నువ్వే కారణం అవుతావు..బిగ్‌బాస్ నటుడిపై ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్!
Navdeep: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’. సీజన్-10 త్వరలోనే ప్రారంభం కానుండటంతో, సామాన్యులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలోంచి కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న ‘అగ్నిపరీక్ష 2’ ఆడిషన్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, ఈ ఆడిషన్స్‌లో పాల్గొన్న ప్రముఖ సోషల్ మీడియా సెన్సేషన్, యూట్యూబర్ ఉప్పల్ బాలు ఎలిమినేట్ కావడంతో, ఆయన చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు నెట్టింట తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఆడిషన్స్‌లో తనను ఘోరంగా అవమానించారంటూ ఉప్పల్ బాలు వరుస సెల్ఫీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆడిషన్స్‌లో జడ్జీగా వ్యవహరించిన ప్రముఖ నటుడు నవదీప్‌పై ఆయన నేరుగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూలు వంటి అన్ని ప్రాథమిక రౌండ్లను దాటుకుని ఫైనల్‌కు చేరుకున్నానని, తమను సెలెక్ట్ చేసినట్లు ఇమెయిల్ కూడా వచ్చిందని బాలు తెలిపారు.
తీరా మెయిన్ స్టేజ్ మీదికి పిలిచాక, కనీసం ఎటువంటి గేమ్ లేదా టాస్క్ ఆడించే అవకాశం ఇవ్వకుండానే.. నువ్వు చేసేవి చిల్లర, వల్గర్ వీడియోలు.. అసలు నీకు ఫ్యాన్స్ ఉన్నారా? నువ్వు ట్రాన్స్జెండర్వా? అంటూ నవదీప్ దారుణంగా వ్యాఖ్యానించారని ఆరోపించారు. గ్రూప్ డిస్కషన్లో తెలుగు రాని ఒక ముంబై అమ్మాయిని ఎంపిక చేసినప్పుడు, ఎంతో కష్టపడి పైకొచ్చిన నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్లను ఎందుకు చులకన చేస్తారు? అని ప్రశ్నించారు. నవదీప్ ప్రవర్తన తన మనస్సును తీవ్రంగా గాయపరిచిందని చెబుతూ ఉప్పల్ బాలు భావోద్వేగానికి గురయ్యారు.
నేను ఏ తప్పు పనులూ చేయడం లేదు.. కేవలం కాలక్షేపం కోసమే రీల్స్ చేసుకుంటున్నాను. నవదీప్, నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఎన్ని తప్పులు చేశావో. గతంలో డ్రగ్స్ వ్యవహారంలో దొరకలేదా? నా చావుకు నువ్వే కారణం అవుతావు.. నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు అని ఉప్పల్ బాలు వీడియోలో తీవ్రంగా మండిపడ్డారు.
గత సీజన్లో కామనర్ కోటాలో అడుగుపెట్టిన కళ్యాణ్ బిగ్‌బాస్ విన్నర్‌గా నిలవడంతో ఈసారి అగ్నిపరీక్ష ఆడిషన్స్‌పై విపరీతమైన పోటీ నెలకొంది. దాదాపు 70 మంది పోటీపడగా, వారి నుంచి ఫైనల్‌గా కొందరిని హౌస్‌లోకి పంపనున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ బాలు విమర్శలు వైరల్ కావడంతో నెటిజన్లలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆడిషన్స్‌కు పిలిచి ప్రతిభను పరీక్షించకుండా, వ్యక్తిగత విమర్శలు చేసి చిన్నచూపు చూడటం సరికాదు అని ఉప్పల్ బాలుకు మద్దతుగా నిలుస్తుంటే..
మరో వర్గం వారు బిగ్‌బాస్ ఆడిషన్స్ అంటేనే జడ్జీలు వివిధ కోణాల్లో సైకలాజికల్ పరీక్షలు పెడతారు, ఎలిమినేట్ అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని అభిప్రాయపడుతున్నారు. బిగ్‌బాస్-10 టెలికాస్ట్కు ముందే ఈ రకమైన వివాదాలు రేగడంతో, షోపై మరింత హైప్ క్రియేట్ అవడమే కాక ఈ వివాదం ఎటు దారితీస్తుందోనన్న ఆసక్తి బుల్లితెర ప్రేక్షకులలో నెలకొంది.




