Viral Video : బడి పంతులా? మందు బాబులా?.. స్మార్ట్ క్లాస్ రూమ్‌లో ‘చిందు’లేసిన హెడ్‌మాస్టర్.!
Viral Video : ఉత్తరప్రదేశ్ మహోబా జిల్లాలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యావ్యవస్థకే తీరని అవమానం కలిగించేలా ఒక విస్తుపోయే ఘటన వెలుగుచూసింది.
Viral-Video
Viral Video : ఉత్తరప్రదేశ్ మహోబా జిల్లాలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యావ్యవస్థకే తీరని అవమానం కలిగించేలా ఒక విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఒక హెడ్‌మాస్టర్ బడిని కాస్తా మందు బాబుల అడ్డాగా మార్చేశాడు. తరగతి గదిలోనే మద్యం సేవించి, అనుచిత ప్రవర్తనతో అడ్డంగా దొరికిపోవడంతో విద్యాశాఖ అధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
స్మార్ట్ క్లాస్‌లో బూతు పాటలు
సదరు హెడ్‌మాస్టర్ రమేష్ చంద్ర పాఠశాల వేళల్లో రోజంతా తాగి మైకంలో ఊగిపోయేవాడని స్థానికులు మండిపడుతున్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'స్మార్ట్ స్కూల్' ఎల్‌ఈడీ స్క్రీన్‌పై.. విద్యార్థులకు పాఠాలు నేర్పాల్సింది పోయి, అసభ్యకరమైన బూతు పాటలు ప్లే చేస్తూ వికృతానందం పొందేవాడు. అంతటితో ఆగకుండా బడి నడుస్తున్న సమయంలోనే కేవలం ఇన్నర్‌వేర్, తువ్వాలు మాత్రమే కట్టుకుని క్లాస్ రూమ్‌లలో తిరిగేవాడనే ఆరోపణలు షాకింగ్ కు గురిచేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ బాగోతం బట్టబయలైంది. ఆ వీడియోలో సదరు హెడ్‌మాస్టర్ ఖాళీ క్లాస్ రూమ్‌లో మందు మత్తులో బెంచీపై పడి ఉండటం స్పష్టంగా కనిపించింది.
ప్రశ్నిస్తే ఎదురు కేసులు
పాఠశాల ఆవరణను అర్ధరాత్రి పూట సంఘ విద్రోహ శక్తులతో కలిసి తాగుబోతుల అడ్డాగా మార్చేవాడని, పిల్లల ముందే అసభ్యకర పదజాలంతో బూతులు తిట్టేవాడని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పిల్లలైనా ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. తనను ఎదిరిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతానని ఆ హెడ్‌మాస్టర్ బెదిరింపులకు గురిచేసేవాడని ఒక విద్యార్థి వాపోయాడు. చదువుల గుడిని అపవిత్రం చేస్తూ, చిన్నారుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ ఉపాధ్యాయుడి ప్రవర్తనపై సమాజం నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సస్పెన్షన్ వేటు.. విచారణ ప్రారంభం
గ్రామస్థుల నుండి వచ్చిన తీవ్రమైన ఫిర్యాదుల నేపథ్యంలో అసిస్టెంట్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అశ్విని యాదవ్ సదరు పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రాథమిక విచారణలో హెడ్‌మాస్టర్ బడిలోనే మద్యం సేవించడం , అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఆరోపణలన్నీ నిజమేనని తేలింది. దీంతో ఉన్నతాధికారులు సదరు హెడ్‌మాస్టర్ రమేష్ చంద్రను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా శాఖాపరమైన పూర్తిస్థాయి దర్యాప్తుకు కూడా ఆదేశించారు.
जब शिक्षा का मंदिर ही बन जाए अय्याशी का अड्डा, तो फिर इसे शिक्षा का मंदिर कैसे कहा जाए?
— Vikku Sachan (@vikkusachan) July 10, 2026
बेंच पर लेटे दिखाई दे रहे ये हेडमास्टर रमेश चंद्र हैं नशे में चूर होकर सरकारी प्राइमरी स्कूल में आराम से स्मार्ट क्लास की एलईडी पर फुल साउंड में भोजपुरी अश्लील गाने सुन रहे हैं!
अगर बच्चों… pic.twitter.com/KUUrDGMzif




