Traffic Challans: పోలీస్ వాహనానికే 71 చలానాలు..ఫైన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే!
Traffic Challans: ఒక పోలీస్ పెట్రోలింగ్ వాహనంపై గత రెండేళ్లలో ఏకంగా 71 సార్లు చలానాలు నమోదై, రూ.36,500 ఫైన్ పెండింగులో ఉండటాన్ని ఓ అడ్వొకేట్ బట్టబయలు చేశారు.
Traffic Challans: పోలీస్ వాహనానికే 71 చలానాలు..ఫైన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే!
Traffic Challans: నిబంధనలు పాటించండి.. క్షేమంగా ఇళ్లకు చేరండి అంటూ మైకులు పట్టుకుని ప్రజలకు నీతులు చెప్పేది వారే.. రోడ్డుపై చిన్న తప్పు జరిగినా కెమెరాల్లో బంధించి ఇంటికి చలాన్లు పంపేది వారే.. కానీ, అదే చట్టాన్ని రక్షించాల్సిన రక్షకభటులే రూల్స్ బ్రేక్ చేస్తే? అది కూడా ఒకసారి, రెండు సార్లు కాదు.. ఏకంగా 71 సార్లు! వినడానికే షాకింగ్‌గా ఉన్నా, ఒక పోలీస్ పెట్రోలింగ్ వాహనం నిర్వాకం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.
నగరంలో రోడ్డుపై వెళ్తున్న ఒక పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని గమనించిన ఓ అడ్వొకేట్‌కు అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. "ప్రజలను పట్టుకునే పోలీసుల బండికి రూల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా?" అని అనుమానంతో, ఆ వాహనం నెంబర్ ఆధారంగా ఆన్‌లైన్ ట్రాఫిక్ చలాన్ పోర్టల్‌లో తనిఖీ చేశారు.
అంతే అక్కడ కనిపించిన స్క్రీన్ చూసి సదరు న్యాయవాది నోరెళ్లబెట్టారు. గత రెండేళ్ల కాలంలో ఆ ఒక్క పోలీస్ వాహనంపైనే ఏకంగా 71 సార్లు చలానాలు నమోదయ్యాయి. మొత్తం పెండింగ్ ఫైన్ ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 36,500.
ఇంకా విచిత్రం ఏంటంటే.. ఇందులో మెజారిటీ చలానాలు దేనికోసం పడ్డాయో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. కారు నడిపేటప్పుడు కనీస నియమమైన సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ఈ 71 చలానాల్లో అత్యధికం నమోదయ్యాయి. పోలీసుల నిర్లక్ష్యాన్ని ఊరికే వదిలేయని ఆ అడ్వొకేట్, ఆధారాల (స్క్రీన్ షాట్స్)తో సహా ఈ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం కాస్తా దావానంలా ఇంటర్నెట్‌ను ఊపేసింది.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు, స్థానిక ప్రజలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఒక రూల్.. మీకు ఒక రూలా?, ప్రజల దగ్గర వసూలు చేసే ఫైన్ల డబ్బుతో ఈ పోలీసుల చలానాలు కడతారా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు. విషయం కాస్తా ముదిరి పాకాన పడటంతో డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపడుతూ మీడియా ముందుకు వచ్చారు.
చట్టం ,ట్రాఫిక్ రూల్స్ అనేవి ఎవరికైనా ఒక్కటే. ఖాకీ యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన రూల్స్ అతిక్రమిస్తే ఊరుకునేది లేదు. ఈ 71 చలానాల నిబంధనల ఉల్లంఘనకు ఆ వాహనాన్ని నడిపిన డ్రైవరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సదరు సిబ్బందిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం" అని అధికారులు స్పష్టం చేశారు.
అధికారులు యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ, ప్రజల నుంచి విమర్శలు మాత్రం ఆగడం లేదు. చట్టాన్ని కాపాడాల్సిన వారే ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై సామాన్యులు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా.. ఒక లాయర్ గారు బుర్ర ఉపయోగించి తీసిన పోలీస్ బండి జాతకం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.




