ViralVIdeo: ముంబై రోడ్లపైకి 'స్పైడర్ మాన్'.. ఏం చేస్తున్నాడో చూస్తే షాకే.!

ముంబైలో భారీ వర్షాలకు నీట మునిగిన రోడ్లపై వాహనదారులకు, పాదచారులకు 'స్పైడర్ మ్యాన్' వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి సాయం చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Ravi
By Ravi
Published on: 7 July 2026 8:10 PM IST
ViralVIdeo
X

ViralVIdeo: ముంబై రోడ్లపైకి 'స్పైడర్ మాన్'.. ఏం చేస్తున్నాడో చూస్తే షాకే.!

ముంబై: ఒక భవనం నుంచి మరో భవనానికి దూకే స్పైడర్ మ్యాన్‌కు రోడ్డుపై పనేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అది కేవలం సినిమాల్లో మాత్రమే జరిగినా, రియల్ లైఫ్‌లో అచ్చం అలాంటి డ్రెస్సు వేసుకున్న ఓ వ్యక్తి ముంబై రోడ్లపై ప్రజలకు సహాయం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంబై నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో, ఆ నీటి కింద ఉన్న గుంతలు కనిపించక వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మోమిన్ అనే ఒక కంటెంట్ క్రియేటర్ వారికి అండగా నిలిచాడు. స్పైడర్ మ్యాన్ గెటప్‌లో రోడ్డుపైకి వచ్చిన అతను, నీట మునిగిన గుంతల వద్ద వాహనదారులను అప్రమత్తం చేస్తూ, వారి బండ్లను తోస్తూ సురక్షితంగా వెళ్లేలా సహాయం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కష్టకాలంలో ప్రజలకు సాయం చేస్తున్న ఈ రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్‌ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.


Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story