Smart Kid: అడుగో 'భైరవ'.. బుడ్డోడి టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా!

Smart Kid: భారీ వర్షాలకు రోడ్లు జలమయమవడంతో ఒక చిన్నారి బాలుడు తన పెంపుడు కుక్కల సహాయంతో వినూత్నంగా రోడ్డు దాటాడు.

Naresh.k
Published on: 17 Jun 2026 11:39 AM IST
Smart Kid
X

Smart Kid: అడుగో 'భైరవ'.. బుడ్డోడి టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా!

Smart Kid: టాలెంట్‌కు వయసుతో సంబంధం లేదు.. టాలెంట్ ఎవరి సొత్తు కాదు అనే మాటలకు అద్దం పట్టేలా ఒక క్రేజీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భారీ వర్షాల వల్ల రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ, ప్రయాణం నరకప్రాయంగా మారిన వేళ.. ఒక చిన్నారి బాలుడు చేసిన వీర లెవెల్ ప్రయోగం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక ప్రాంతంలో రోడ్డంతా మోకాలోతు నీటితో నిండిపోయింది. వాహనదారులు, సాధారణ ప్రజలు ఆ నీటిని దాటలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ, అక్కడే ఉన్న ఒక బుడ్డోడు మాత్రం అస్సలు కంగారు పడలేదు. నీటిలో తడవకుండా రోడ్డు దాటడానికి ఒక అదిరిపోయే ప్లాన్ వేశాడు. మంచు కురిసే ప్రాంతాల్లో కుక్కలను కట్టి స్లెడ్జ్ బండ్లు లాగించడం మనం సినిమాల్లో చూసే ఉంటాం. ఈ బుడ్డోడు సరిగ్గా అదే ఐడియాను వరద రోడ్డుపై ఇంప్లిమెంట్ చేశాడు.

తన ఇంట్లో ఉన్న నాలుగు పెంపుడు కుక్కలను తీసుకొచ్చి.. ఒక చిన్న తోపుడు బండికి కట్టాడు. పాతకాలపు గుర్రపు బండి తరహాలో ఒక వినూత్న డాగ్ కార్ట్‌ను రెడీ చేశాడు. ఆ బండిపై రాజాలా కూర్చుని.. ఆ నాలుగు కుక్కల సహాయంతో చాలా సులభంగా, స్టైల్‌గా ఆ వరద నీటిని దాటేసి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ బుడ్డోడి క్రియేటివిటీ ఒకెత్తయితే.. ఆ కుక్కలు చూపించిన క్రమశిక్షణ, బండిని లాగిన తీరు చూసి రోడ్డుపై వెళ్లేవారంతా షాక్ అయ్యారు.

ఈ వినూత్న దృశ్యాన్ని అక్కడ ఉన్న కొందరు మొబైల్ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బుడ్డోడి సమయస్ఫూర్తిని, తెలివితేటలను తెగ మెచ్చుకుంటున్నారు. వీడు మామూలోడు కాదు .. ఫ్యూచర్ ఇంజినీర్ అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. ఆ కుక్కల లాయల్టీకి, కోఆపరేషన్‌కు హాట్సాఫ్ అంటూ మరికొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏదేమైనా, ఆపదలో ఉన్నప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా.. ఉన్న వనరులతోనే ఇలాంటి క్రేజీ ఐడియా వేసి స్మార్ట్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన ఆ బుడ్డోడు నిజంగా గ్రేట్.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story