Viral Video: రూ. 10కే కంపెనీ లంచ్.. ఇంతకన్నా ఏం కావాలన్న సెక్యూరిటీ గార్డ్.. వీడియో వైరల్!

Viral Video: కేవలం పది రూపాయలకే తన కంపెనీ అందిస్తున్న కమ్మనైన భోజనాన్ని ఓ సెక్యూరిటీ గార్డ్ సోషల్ మీడియాలో చూపించగా, ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

Ravi
By Ravi
Updated on: 31 July 2026 6:01 PM IST
Viral Video
X

Viral Video: రూ. 10కే కంపెనీ లంచ్.. ఇంతకన్నా ఏం కావాలన్న సెక్యూరిటీ గార్డ్.. వీడియో వైరల్!

Viral Video: ప్రస్తుత రోజుల్లో బయట ఒక సాధారణ భోజనం చేయాలన్నా కనీసం వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా నగరాల్లో చిన్న ఉద్యోగాలు చేసేవారికి ఇది ఆర్థికంగా భారంగా మారుతుంది. అయితే ఇటువంటి సమయంలో ఓ కంపెనీ తన ఉద్యోగులకు కేవలం 10 రూపాయల అతి తక్కువ ధరకే రుచికరమైన, శుభ్రమైన భోజనాన్ని అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆనంద్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డ్ తన కంపెనీ కేటాయించిన మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆయన తమ కంపెనీ కేవలం రూ. 10 మాత్రమే తీసుకుని ఎంతో వైవిధ్యమైన భోజనాన్ని అందిస్తోందని తెలిపారు. ఆ భోజనంలో అన్నం, పప్పు, సోయాబీన్ కర్రీ, కరకరలాడే కాకరకాయ భుజియా, పాపడ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు ఉన్నట్లు ఆయన చూపించారు. బయట మార్కెట్‌లో ఈ రకమైన భోజనం కొనుగోలు చేయాలంటే కనీసం 50 నుండి 100 రూపాయల వరకు ఖర్చవుతుందని ఆయన పేర్కొన్నారు.

కాగా, ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ కావడంతో నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. కేవలం పది రూపాయలకే ఇంత చక్కటి పౌష్టికాహారాన్ని అందిస్తున్న ఆ కంపెనీ యాజమాన్యాన్ని పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా అభినందిస్తున్నారు. మరికొందరు యూజర్లు ఆ కంపెనీ ఏంటో తమకూ చెప్పాలంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, చిన్న ఉద్యోగుల సంక్షేమం కోసం కంపెనీలు తీసుకునే ఇటువంటి చిన్న నిర్ణయాలు ఎంతోమందికి సంతోషాన్ని కలిగిస్తాయని ఈ ఘటన నిరూపించింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story