Viral: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ఐఐఎంలో చేరిన యువకుడు.. భారీగా నష్టపోయానంటున్నాడు.! ఎందుకో తెలుసా?

Viral: ఐఐఎం అహ్మదాబాద్‌లో సీటు రావడం ఏ విద్యార్థికైనా కల. కానీ, ఒక యువకుడు ఆ కల కోసం తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి, ఏకంగా రూ. 74 లక్షల మేర నష్టపోయానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Ravi
By Ravi
Published on: 18 July 2026 5:03 PM IST
Viral
X

Viral: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ఐఐఎంలో చేరిన యువకుడు.. భారీగా నష్టపోయానంటున్నాడు.! ఎందుకో తెలుసా?

Viral: ఐఐఎం అహ్మదాబాద్‌లో సీటు రావడం ఏ విద్యార్థికైనా కల. కానీ, ఒక యువకుడు ఆ కల కోసం తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి, ఏకంగా రూ. 74 లక్షల మేర నష్టపోయానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఉన్నత చదువుల కోసం మంచి స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేయడం సాహసమే. అయితే, ఒక యువకుడు తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఐఐఎం అహ్మదాబాద్‌లో చేరడం వెనుక ఉన్న ఆర్థిక కోణాన్ని బయటపెట్టారు. తాను ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఏకంగా రూ. 74 లక్షల మేర నష్టపోయానని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

ఆ యువకుడు తన విశ్లేషణలో ఆ అవకాశాన్ని లెక్కగట్టారు. తాను ఆ ఉద్యోగంలో కొనసాగి ఉంటే రాబోయే రోజుల్లో వచ్చే జీతం, పెన్షన్ ప్రయోజనాలు, ఇతర సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం రూ. 74 లక్షలకు చేరుకుంటుందని ఆయన వివరించారు. ఐఐఎం అహ్మదాబాద్‌లో చదువుకోవడం వల్ల కెరీర్ పరంగా ఎంతో పురోగతి ఉంటుందని నమ్మినా, ప్రస్తుతానికి మాత్రం ఈ ఆర్థిక నష్టం కనిపిస్తోందని ఆయన తెలిపారు.

కాగా, ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటే, మరికొందరు ఇలాంటి లెక్కలు జీవితంలో ప్రతిదీ ఆశించినట్లు జరగవని చెబుతున్నారు. కెరీర్ మార్పుల వల్ల వచ్చే లాభనష్టాలను ఎలా అంచనా వేయాలో ఈ ఉదాహరణ అర్ధమైయ్యేలా చెబుతోంది. చదువు కోసం కెరీర్‌ను పణంగా పెట్టిన ఆ యువకుడి నిర్ణయం, ఎంతో మంది ఆశావాహులకు ఒక కొత్త కోణాన్ని చూపిస్తోంది.


Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story