Pakistan Plane Crash : పాక్‌లో ఘోర విమాన ప్రమాదం.. CCTVలో భయానక దృశ్యాలు.!

Pakistan Plane Crash : పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలో ఒక ఘోర విమాన ప్రమాదం జరిగింది. మర్దాన్ ఏరియాలో పాకిస్తాన్ వైమానిక దళానికి (PAF) చెందిన ఒక శిక్షణా..

G Krishna
Published on: 15 Jun 2026 12:58 PM IST
Pakistan Plane Crash
X

Pakistan Plane Crash 

Pakistan Plane Crash : పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలో ఒక ఘోర విమాన ప్రమాదం జరిగింది. మర్దాన్ ఏరియాలో పాకిస్తాన్ వైమానిక దళానికి (PAF) చెందిన ఒక శిక్షణా విమానం సాంకేతిక లోపంతో ఒక్కసారిగా రోడ్డుపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు సాధారణ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన సీసీటీవీ (CCTV) విజువల్స్ కూడా బయటకు వచ్చాయి.

రోడ్డుపై పడగానే పెద్ద పేలుడు.,

పాకిస్తాన్ వైమానిక దళ వివరాల ప్రకారం.. ఈ విమానం రోజువారీ సాధారణ శిక్షణలో భాగంగానే ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరింది. అయితే ఆకాశంలో ఉండగానే విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో పైలట్ల నియంత్రణ కోల్పోయిన ఆ విమానం నేరుగా కింద ఉన్న ఒక రహదారిపైకి దూసుకొచ్చి కూలిపోయింది. నేలపై పడిన మరుక్షణమే విమానం పెద్ద శబ్దంతో పేలిపోయి, భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుందని స్థానికులు భయాందోళనలతో చెప్పారు.

పైలట్ల మృతదేహాలు చెల్లాచెదురు..

ఈ ప్రమాద తీవ్రతకు విమాన శకలాలు ఆ రోడ్డు పొడవునా పడిపోయాయి. విమానాన్ని నడుపుతున్న ఇద్దరు పైలట్ల మృతదేహాలు కూడా రోడ్డుపైనే చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పాకిస్తాన్ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఈ ప్రమాదాన్ని, మరణాలను అధికారికంగా ధృవీకరించారు. మృతి చెందిన పైలట్లను కెప్టెన్ ఖాసిం, కెప్టెన్ తల్హాగా అధికారులు గుర్తించారు. దేశం ఇద్దరు ప్రతిభావంతులైన పైలట్లను కోల్పోయిందని హోం మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

రంగంలోకి సహాయక బృందాలు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సమాచారంతో ఆర్మీ , ఎయిర్‌ఫోర్స్ సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చి, రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న ముగ్గురు బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పైలట్ల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఎయిర్‌ఫోర్స్ ఆసుపత్రికి పంపించారు. అసలు విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తింది? అనే పూర్తి కారణాలను తెలుసుకునేందుకు పాకిస్తాన్ వైమానిక దళం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story