Number Puzzle: మెదడుకు పదును పెట్టే నంబర్ పజిల్.. సమాధానంను 10 సెకండ్లలో చెప్పగలరా?
Number Puzzle: సోషల్ మీడియాలో మెదడుకు పదును పెట్టే సంఖ్యల పజిల్స్‌కు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ప్రతి రోజు ఎన్నో పజిల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Number Puzzle: మెదడుకు పదును పెట్టే నంబర్ పజిల్.. సమాధానంను 10 సెకండ్లలో చెప్పగలరా?
Missing Number Puzzle: సోషల్ మీడియాలో మెదడుకు పదును పెట్టే సంఖ్యల పజిల్స్‌కు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ప్రతి రోజు ఎన్నో పజిల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వైరల్ అవుతున్న ఓ నంబర్ పజిల్ నెటిజన్లను బాగా ఆలోచింపజేస్తోంది.
మూడు వృత్తాల్లో కొన్ని సంఖ్యలు ఇచ్చి.. చివరి వృత్తంలోని ఖాళీ స్థానంలో ఏ సంఖ్య రావాలో చెప్పాలని ఈ పజిల్లో ప్రశ్నించారు. చాలామంది సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. కొందరు మాత్రం చాలా ఈజీ అంటూ.. ఆన్సర్ చెప్పేశారు. ఆ నంబర్ పజిల్‌కు ఏంటి, దానికి సరైన సమాధానం ఏంటో చూద్దాం.
మొదటి వృత్తంలో 15, 21, 27 అనే సంఖ్యలు ఉన్నాయి. వీటిని నిశితంగా గమనిస్తే.. ప్రతి సంఖ్యను 3తో భాగిస్తే సరిపోతుంది. అప్పుడు వరుసగా 5, 7, 9 వస్తాయి. మొదటి వృత్తం లాజిక్ తెలిసిపోయింది.
15 ÷ 3 = 5
21 ÷ 3 = 7
27 ÷ 3 = 9
ఇప్పుడు రెండో వృత్తంలోని 10, 14, 18 సంఖ్యలు ఉన్నాయి. ఇవి మొదటి వృత్తంలోని సంఖ్యలకు 2/3 విలువలుగా కనిపిస్తాయి. లేదంటే 2తో భాగిస్తే ఆన్సర్ వస్తుంది. అంటే మొదటి వృత్తం నుంచి రెండో వృత్తానికి ఒకే నిష్పత్తి (2/3) ప్రకారం సంఖ్యలు మారాయి.
15 × 2/3 = 10
21 × 2/3 = 14
27 × 2/3 = 18
ఇక మూడో వృత్తాన్ని గమనిస్తే.. రెండో వృత్తంలోని ప్రతి సంఖ్యను 2తో భాగించారు. మూడో వృత్తంలో ఇప్పటికే 5, 9 ఉన్నాయి. కాబట్టి మధ్యలో ఉండాల్సిన సంఖ్య 7 అని స్పష్టమవుతోంది.
10 ÷ 2 = 5
14 ÷ 2 = 7
18 ÷ 2 = 9
ఈ పజిల్లో ప్రధానంగా గణిత సూత్రాల కంటే సంఖ్యల మధ్య ఉన్న ప్యాటర్న్‌ను గుర్తించడం ముఖ్యం. ఒకసారి ఆ ప్యాటర్న్ అర్థమైతే.. సమాధానం చాలా సులభంగా దొరుకుతుంది. ఈ పజిల్‌కు సరైన సమాధానం 7.
ఇక్కడ మరో ప్యాటర్న్ కూడా మనం అప్లై చేయొచ్చు. మొదటి వృత్తంలోని సంఖ్యలను.. 3 x 5 = 15, 3 x 7 = 21, 3 x 9 = 27 అవుతుంది. వృత్తంలోని సంఖ్యలను.. 2 x 5 = 10, 2 x 7 = 14, 2 x 9 = 18గా వస్తుంది. ఈ ప్యాటర్న్‌ను చివరి మూడో వృత్తాన్ని అమలు చేస్తే.. 31 x 5 = 5, 1 x 7 = 7, 1 x 9 = 9 అవుతుంది. 3, 2, 1 అంకెలతో 5, 7, 9లను గుణిస్తే కూడా ఆన్సర్ వస్తుంది.




