Model Twisha Sharma : నోయిడా మోడల్ డెత్ మిస్టరీలో కొత్త ట్విస్ట్.. చివరి చాట్స్‌లో దాగిన రహస్యం..!
Model Twisha Sharma : నోయిడాకు చెందిన 31 ఏళ్ల త్విషా శర్మ మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది...
twisha-sharma
Model Twisha Sharma : నోయిడాకు చెందిన 31 ఏళ్ల త్విషా శర్మ మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భోపాల్‌లోని కటారా హిల్స్‌లో ఉన్న ఆమె అత్తవారింట్లో మే 12న త్విషా శర్మ శవమై కనిపించింది. పెళ్లయిన కేవలం ఆరు నెలలకే ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోవడం, చనిపోయే ముందు ఆమె తన తల్లికి, ఫ్రెండ్‌కు పెట్టిన వాట్సాప్ మెసేజ్‌లు ఇప్పుడు బయటకు రావడంతో ఈ మర్డర్ మిస్టరీ మరింత ముదిరింది.
ఎంబీఏ గ్రాడ్యుయేట్.. మిస్ పూణే కంటెస్టెంట్..!
ఎంబీఏ చదివిన త్విషా శర్మ, గతంలో 'మిస్ పూణే' కాంటెస్ట్‌లో రన్నరప్‌గా కూడా నిలిచింది. 2024లో ఒక డేటింగ్ యాప్ ద్వారా భోపాల్‌కు చెందిన లాయర్ సమర్థ్ సింగ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి, డిసెంబర్ 2025లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొత్తలో అంతా బాగానే ఉంది అనుకునే లోపే, ఆమె అత్తవారింట్లో నరకం చూసిందని త్విషా ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు.
'నా లైఫ్ నరకమైంది అమ్మ'.. గుండెల్ని పిండేసే వాట్సాప్ చాట్స్
చనిపోవడానికి కొన్ని రోజుల ముందు త్విషా తన తల్లికి పెట్టిన మెసేజ్‌లు చూస్తే ఆమె ఎంత మానసిక వేదన అనుభవించిందో అర్థమవుతుంది. ఆమె తన తల్లికి మెసేజ్ చేస్తూ తనకు అక్కడ చాలా ఉక్కిరిబిక్కిరిగా ఉందని, ఊపిరాడనట్లుగా ఉందని వాపోయింది. నన్ను ఇక్కడికి ఎందుకు పంపావు, తను నాతో అసలు మాట్లాడటం లేదు, నన్ను భోపాల్ పిలిపించి మళ్ళీ పాత నాటకాలే ఆడుతున్నాడంటూ తన బాధను పంచుకుంది. తన జీవితం నరకప్రాయం అయిపోయిందని చెప్తూ, ప్లీజ్ రేపే వచ్చి నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో అంటూ మే 7న తన తల్లిని బ్రతిమాలుకుంది. కేవలం తల్లికే కాదు, తన బెస్ట్ ఫ్రెండ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తూ తాను పూర్తిగా ఇరుక్కుపోయానని, నువ్వు మాత్రం తొందరపడి పెళ్లి చేసుకోకు అని, బాగా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యి అంటూ హెచ్చరించింది.
అబార్షన్ చేయించుకోవాలని ప్రెజర్.!
త్విషా ఫ్యామిలీ లాయర్ కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్‌లో త్విషా ప్రెగ్నెంట్ అయింది. అయితే భర్త సమర్థ్, అతని తల్లి గిరిబాల సింగ్ ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ తనది కాదంటూ అనుమానించారు. అంతేకాదు, ఆ ప్రెగ్నెన్సీని తీసేయాలంటూ అబార్షన్ కోసం ఆమెపై తీవ్రంగా ప్రెజర్ తెచ్చారు. కట్నం కోసం వేధించడమే కాకుండా, సమర్థ్ ఆమెపై పలుమార్లు ఫిజికల్ అటాక్ కూడా చేశాడని, కట్నం కింద రెండు లక్షల రూపాయలు తీసుకున్నా సరే వారి వేధింపులు ఆగలేదని త్విషా తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు.
ఆ రాత్రి ఏం జరిగింది.?
భర్త ఫ్యామిలీ చెబుతున్న కథనం ప్రకారం మే 12న త్విషా నార్మల్‌గా బ్యూటీ పార్లర్‌కు వెళ్లి, ఆపై పార్క్‌లో కాసేపు వాకింగ్ చేసి రాత్రి 7:30 కి ఇంటికి వచ్చింది. వన్ అవర్ టీవీ చూశాక, కిందకు వెళ్లి పేరెంట్స్‌తో ఫోన్ మాట్లాడింది. ఆ తర్వాత రాత్రి 10:15 కి టెర్రస్ మీద ఉన్న ఐరన్ రాడ్‌కు ఎక్సర్సైజ్ బ్యాండ్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని వారు చెబుతున్నారు. కానీ త్విషా పేరెంట్స్ ఈ కథనాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. రాత్రి 10:35 వరకు త్విషా తమతో భయపడుతూ ఫోన్ మాట్లాడిందని, ఆ తర్వాత సడన్‌గా ఫోన్ కట్ అయిందని చెప్పారు. కొద్దిసేపటికే అల్లుడు సమర్థ్ ఫోన్ చేసి త్విషా ఇక ఈ ప్రపంచంలో లేదు అని చాలా కూల్‌గా చెప్పాడని, ఇది ముమ్మాటికీ హత్యేనని వారు ఆరోపిస్తూ మళ్లీ రీ-పోస్ట్‌మార్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
డ్రగ్స్ తీసుకునేదంటున్న అత్త
ఇదిలా ఉంటే, త్విషా అత్త, రిటైర్డ్ జడ్జ్ అయిన గిరిబాల సింగ్ ఈ ఆరోపణలను తప్పుబడుతున్నారు. త్విషా మానసిక సమస్యలతో బాధపడుతోందని, ఆమెకు సిజోఫ్రెనియా వ్యాధి ఉందని క్లెయిమ్ చేశారు. ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా ఆమె భారీగా గంజాయి తీసుకునేదని, తాము ఎంత కాపాడదామన్నా ఆమె డ్రగ్స్ అలవాటు వల్లే ఆత్మహత్య చేసుకుందని రివర్స్ ఆరోపణలు చేశారు. తన కొడుకు సమర్థ్ ఎలాంటి డ్రగ్స్ తీసుకోడని, అతను చాలా సమర్థుడైన లాయర్ అని ఆమె సపోర్ట్ చేశారు.
కోర్టు సీరియస్.. భర్త పరార్..!
పెళ్లయిన ఆరు నెలలకే ఈ దారుణం జరగడం, బాడీపై గాయాలు ఉండటం , వాట్సాప్ చాట్స్ ఆధారంగా భోపాల్ సెషన్స్ కోర్టు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇది పూర్తిగా అనుమానాస్పద మృతి అని స్పష్టం చేస్తూ, భర్త సమర్థ్ సింగ్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు జడ్జ్ పల్లవి ద్వివేది నిరాకరించారు. కేసు తీవ్రత దృష్ట్యా ఈ స్టేజ్‌లో బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం కేసు బుక్ అవ్వడంతో భర్త సమర్థ్ పరారీలో ఉన్నాడు. ఒక అందమైన యువతి, బాగా చదువుకున్న అమ్మాయి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ కలచివేస్తోంది..




