Dreams: కలలో తెలియని వ్యక్తులు కనిపిస్తున్నారా.? దాని వెనుక సంకేతం ఇదే

Dreams: రాత్రి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా సినీ యాక్టర్లు కలలోకి ఎందుకు వస్తారు? అలాగే ఎవరైనా మనల్ని తరుముతున్నట్లు, చంపేస్తున్నట్లు లేదా ప్రమాదాలు జరుగుతున్నట్లు భయంకరమైన కలలు ఎందుకు వస్తాయో తెలుసా.

Ravi
By Ravi
Published on: 9 July 2026 2:18 PM IST
Dreams
X

Dreams: కలలో తెలియని వ్యక్తులు కనిపిస్తున్నారా.? దాని వెనుక సంకేతం ఇదే

Dreams: నిద్రలో కలలు రావడం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు మనకు ఏమాత్రం సంబంధం లేని సినీ హీరోలు, హీరోయిన్లు కలలోకి రావడం, లేదా ఎవరైనా మనపై దాడి చేసి చంపేస్తున్నట్లు, దయ్యాలు తరుముతున్నట్లు భయంకరమైన కలలు వస్తుంటాయి. ఇలాంటి కలలు ఎందుకు వస్తాయన్న దానిపై జ్యోతిష్య నిపుణులు చెప్పిన ప్రధాన కారణాలు ఇవే.

మనం పడుకునే ముందు దేని గురించైతే ఎక్కువగా ఆలోచిస్తామో లేదా ఏదైనా భయానక సినిమా చూస్తామో, అందులో మనం బాగా లీనమైపోతాం. మన బ్రెయిన్ ఆ ఆలోచనల నుంచి బయటకు రాలేదు కాబట్టి, నిద్రపోగానే అదే సినిమా పాత్రల్లోకి మనం వెళ్లిపోయినట్లు ఆ కలలు రిపీట్ అవుతుంటాయి. అందుకే పెద్దలు పడుకునే ముందు ప్రశాంతంగా భగవంతుని నామస్మరణ చేసుకోవాలని చెబుతారు.

ప్రతి మనిషికి కర్మ ఫలం ఉంటుంది. ఒక వ్యక్తి గత జన్మలో చేసిన లేదా తన తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం వల్ల, భవిష్యత్తులో అతనికి జరగాల్సిన ఒక పెద్ద ప్రమాదాన్ని భగవంతుడు నిజ జీవితంలో కాకుండా, కేవలం ఆ కలలో మాత్రమే ఆ బాధను అనుభవించేలా చేసి కర్మను అక్కడితో తొలగిస్తాడట.

అలాగే, జాతకంలో కేతువు బలంగా ఉన్నవారికి సిక్స్త్ సెన్స్ అద్భుతంగా పనిచేస్తుంది. అలాంటి వారికి భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలు ముందుగానే కలల రూపంలో హింట్స్ లాగా వస్తాయని స్పష్టం చేశారు. ఇలాంటి భయంకరమైన కలల నుంచి ఉపశమనం పొందడానికి, నిద్రకు ఉపక్రమించే ముందు హనుమాన్ చాలీసా వంటి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే స్తోత్రాలు చదువుకోవాలని సూచించారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story