Viral Video: చోలే తినదామని ఆర్డర్ చేసిన యువతి.. డబ్బాలో కనిపించింది చూడగా బిత్తరపోయింది..
Viral Video: ముంబైకి చెందిన ఒక లేడీ డాక్టర్ క్విక్ కామర్స్ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన చోలే కర్రీలో చనిపోయిన బొద్దింక రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Viral Video: చోలే తినదామని ఆర్డర్ చేసిన యువతి.. డబ్బాలో కనిపించింది చూడగా బిత్తరపోయింది..
Viral Video: ప్రస్తుత ఆధునిక కాలంలో నిమిషాల వ్యవధిలోనే నిత్యవసరాలు అలాగే ఆహార పదార్థాలను ఇంటికి చేరవేస్తున్న క్విక్ కామర్స్ సేవలపై ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే ఈ వేగవంతమైన సేవలలో నాణ్యత, పరిశుభ్రత లోపించడం పట్ల తరచుగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ముంబైకి చెందిన ఒక డాక్టర్ ప్రముఖ డెలివరీ యాప్ అయిన జెప్టో ద్వారా చోలే వంటకాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది. ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసి చూసిన ఆ డాక్టర్‌కు షాక్ తగిలింది. లోపల ఒక పెద్ద చనిపోయిన బొద్దింక స్పష్టంగా కనిపించడంతో ఆమె కంగుతిన్నారు.
ఆహార భద్రత ప్రమాణాలను గాలికి వదిలేసి ఇలాంటి ప్రమాదకరమైన వస్తువులను కస్టమర్లకు విక్రయించడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలతో చెలగాటమాడే ఈ నిర్లక్ష్య ధోరణికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. నెటిజన్లు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల తీరును తప్పుబడుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఇలాంటి సంస్థలపై ఆహార భద్రతా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు, సామాన్యులు సైతం ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ ఫుడ్ సేఫ్టీ ఆడిటింగ్ సరిగ్గా లేకపోవడమే ఇలాంటి ప్రమాదాలకు కారణమని మండిపడుతున్నారు.
కాగా, ఈ ఘటనపై స్పందించిన సంబంధిత డెలివరీ సంస్థ కస్టమర్‌కు క్షమాపణలు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా నాణ్యతపై మరింత కఠినమైన నిఘా ఉంచుతామని హామీ ఇచ్చింది. అయినప్పటికీ, ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసే తినుబండారాల నాణ్యతపై వినియోగదారులలో మాత్రం తీవ్రమైన భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర సేవలందిస్తున్నామని చెప్పే యాప్‌లు కనీస పరిశుభ్రత నియమాలను పాటించడం తప్పనిసరి అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.




