మీ బ్రెయిన్‌కి పదును పెట్టే మ్యాథ్స్ పజిల్.. ఈ మిస్సింగ్ నంబర్‌ను 15 సెకన్లలో కనిపెట్టగలరా?

Math Puzzle: తాజాగా ఆసక్తికరమైన నంబర్ మిస్సింగ్ పజిల్ ఒకటి నెటిజన్లకు సవాల్ విసురుతోంది.

Venkata Thirumala
Published on: 12 Aug 2026 8:18 PM IST
Math Puzzle
X

మీ బ్రెయిన్‌కి పదును పెట్టే మ్యాథ్స్ పజిల్.. ఈ మిస్సింగ్ నంబర్‌ను 15 సెకన్లలో కనిపెట్టగలరా?

Math Puzzle: సోషల్ మీడియాలో ప్రస్తుతం బ్రెయిన్ టీజర్లు, మ్యాథ్స్ పజిల్స్‌ తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణ లెక్కల మాదిరిగా కనిపించినప్పటికీ.. వీటిలో దాగి ఉన్న లాజిక్‌ను గుర్తించడం అంత సులభం కాదు. ఇలాంటి పజిల్స్‌ మన పరిశీలనా శక్తితో పాటు లాజికల్ థింకింగ్‌ను కూడా పరీక్షిస్తాయి. తాజాగా అలాంటి ఆసక్తికరమైన నంబర్ మిస్సింగ్ పజిల్ ఒకటి నెటిజన్లకు సవాల్ విసురుతోంది. ఇందులో మిస్సింగ్ నంబర్‌ను కేవలం 15 సెకన్లలో గుర్తించాలి.

ప్యాటర్న్‌ను గుర్తించడం ముఖ్యం:

ఈ తరహా పజిల్స్‌లో కొన్ని సంఖ్యలను వరుసగా అమర్చి.. ఒక చోట మాత్రం నంబర్‌ను ఖాళీగా ఉంచుతారు. ఆ ఖాళీ స్థానంలో ఏ సంఖ్య రావాలో గుర్తించడమే అసలు సవాల్. ఇందుకోసం సాధారణ గణిత పరిజ్ఞానం కంటే.. ఇచ్చిన సంఖ్యల మధ్య ఉన్న ప్యాటర్న్‌ను గుర్తించడం చాలా ముఖ్యం. మీరు కూడా ఈ పజిల్‌ను ముందుగా స్వయంగా ప్రయత్నించి సమాధానం కనిపెట్టండి. మీవల్ల కాదు అనుకున్నడప్పుడు కింది పేరాకు వెళ్ళండి.

మొదటి రెండు వరుసల్లో దాగున్న లాజిక్ ఇదే:

# పజిల్‌లోని మొదటి వరుసను అడ్డంగా పరిశీలిస్తే.. 289 అనే సంఖ్య కనిపిస్తుంది. 289 అనేది సాధారణ సంఖ్య కాదు. ఇది 17² (17 × 17)కు సమానం. అంటే మొదటి వరుసలో 17 యొక్క వర్గం దాగి ఉంది.

# అదే విధంగా రెండో వరుసలో 324 అనే సంఖ్య ఉంటుంది. 324 కూడా ఒక వర్గ సంఖ్యే. ఎందుకంటే 18² (18 × 18) = 324. దీంతో మొదటి రెండు వరుసలను పరిశీలిస్తే.. వరుసగా 17², 18² అనే ప్యాటర్న్ కనిపిస్తుంది.

మూడో వరుసలో ఏం రావాలి?:

ఇప్పుడు ఇదే లాజిక్‌ను మూడో వరుసకు వర్తింపజేయాలి. మొదటి వరుసలో 17², రెండో వరుసలో 18² ఉన్నందున.. తర్వాతి వరుసలో 19² రావాలి. సో 19 × 19 = 361. అంటే మూడో వరుసలో ఏర్పడాల్సిన సంఖ్య 361. పజిల్‌లో మూడో వరుసలో చివరి అంకె మిస్సింగ్‌గా ఉంది. 361లో చివరి అంకె 1 కాబట్టి.. ఖాళీ స్థానంలో రావాల్సిన సరైన సమాధానం 1.

సరైన సమాధానం:

ఈ బ్రెయిన్ టీజర్‌కు సమాధానం 1. మొదటి రెండు వరుసల్లో 17² = 289, 18² = 324 అనే ప్యాటర్న్‌ను గుర్తించి.. తర్వాత 19² = 361 అని లెక్కిస్తే మిస్సింగ్ నంబర్‌ను సులభంగా కనిపెట్టవచ్చు. ఇలాంటి పజిల్స్‌లో కేవలం లెక్కలు చేయడం మాత్రమే కాదు.. సంఖ్యల మధ్య దాగి ఉన్న సంబంధాన్ని గుర్తించడం ముఖ్యం. మీరు కూడా ఈ పజిల్‌కు 15 సెకన్లలోపే 1 అని సమాధానం చెప్పగలిగితే.. మీ పరిశీలనా శక్తి, లాజికల్ థింకింగ్ అద్భుతంగా ఉన్నట్టే.

Venkata Thirumala

Venkata Thirumala

Next Story