మైండ్ ట్విస్టింగ్ పజిల్.. ముందుగా ఏ గ్లాస్ నిండుతుందో 10 సెకన్లలో చెప్పగలరా?
Mind puzzle: నెటిజన్లను గందరగోళానికి గురిచేస్తున్న ఓ మైండ్ ట్విస్టింగ్ పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మైండ్ ట్విస్టింగ్ పజిల్.. ముందుగా ఏ గ్లాస్ నిండుతుందో 10 సెకన్లలో చెప్పగలరా?
Mind puzzle: ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్రెయిన్ టీజర్లు, పజిల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా కనిపించే ఈ పజిల్స్‌లో దాగి ఉన్న లాజిక్‌ను గుర్తించడం అంత సులభం కాదు. ఇలాంటి ప్రశ్నలు మన పరిశీలనా శక్తి, లాజికల్ థింకింగ్, సమస్యను పరిష్కరించే సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. తాజాగా నెటిజన్లను గందరగోళానికి గురిచేస్తున్న ఓ మైండ్ ట్విస్టింగ్ పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీకు సమాధానం తెలియకుంటే ఎమ్ చింతించాల్సిన అసవరం లేదు. కింది పూర్తిగా వివరించబడింది.
ఏ గ్లాస్ ముందుగా నిండుతుంది?:
ఈ పజిల్‌లో పైభాగంలో ఓ నల్లా ఉంటుంది. దాన్ని ఆన్ చేసినప్పుడు నీరు కింద ఉన్న గ్లాసుల్లోకి ప్రవహిస్తుంది. మొత్తం 1 నుంచి 7 వరకు నంబర్లు ఉన్న ఏడు గ్లాసులు ఇందులో కనిపిస్తాయి. ఒక గ్లాస్ నుంచి మరో గ్లాస్‌కు నీరు వెళ్లేందుకు పైపులను ఏర్పాటు చేశారు. అయితే అన్ని పైపులూ తెరిచి ఉండవు. కొన్ని మార్గాలు మధ్యలోనే మూసుకుపోయి ఉంటాయి. దీంతో నీరు ఏ దిశగా ప్రవహిస్తుందో నిశితంగా గమనిస్తేనే ముందుగా ఏ గ్లాస్ నిండుతుందో గుర్తించగలరు.
పైపుల కనెక్షన్లను జాగ్రత్తగా చూడాలి:
ఈ పజిల్‌కు సమాధానం చెప్పే ముందు గ్లాసుల మధ్య ఉన్న పైపులను క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా 5వ, 7వ గ్లాసులకు వెళ్లే పైపు మార్గాలు మూసి ఉండటం ఈ పజిల్‌లో కీలకమైన అంశం. అందువల్ల నీరు ఆ రెండు గ్లాసులకు చేరే అవకాశం ఉండదు. మరోవైపు 1వ గ్లాస్ నుంచి 2, 3వ గ్లాసుల వైపు నీరు వెళ్లే మార్గాలు ఉన్నాయి. 2వ గ్లాస్ నుంచి 4వ గ్లాస్‌కు, 3వ గ్లాస్ నుంచి 6వ గ్లాస్‌కు నీరు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం గ్లాసుల సంఖ్యలను చూసి సమాధానం చెప్పకుండా.. ఏ పైపు ఓపెన్‌గా ఉంది? ఏది బ్లాక్ అయింది? అనే విషయాన్ని గుర్తించాలి.
సమాధానం ఏంటి?:
పైపుల అమరికను పరిశీలించినప్పుడు 5, 7 నంబర్ గ్లాసులకు నీరు వెళ్లే మార్గాలు మూసి ఉండటంతో వాటిని ముందుగా వచ్చే అవకాశాల నుంచి తొలగించాలి. నీటి ప్రవాహం 1వ గ్లాస్ నుంచి 3వ గ్లాస్ వైపు వెళ్లి, అక్కడి నుంచి 6వ గ్లాస్‌కు చేరే విధంగా ఉంటుంది. అందువల్ల ఈ పజిల్‌లో ముందుగా 3వ గ్లాస్, ఆ తర్వాత నీరు 6వ గ్లాస్‌కు చేరుతుంది. అంటే పైపులలోని అడ్డంకులను గుర్తించడం ఈ పజిల్‌లో అసలు ట్విస్ట్.
లాజికల్ థింకింగ్‌కు పరీక్ష:
ఇలాంటి పజిల్స్‌లో వేగంగా సమాధానం చెప్పడం కంటే ప్రతి కనెక్షన్‌ను నిశితంగా పరిశీలించడం చాలా ముఖ్యం. మీరు కూడా ఈ పజిల్‌ను కొన్ని సెకన్లలోనే పరిష్కరించగలిగితే.. మీ పరిశీలనా శక్తి, లాజికల్ థింకింగ్‌కు ఇది మంచి పరీక్షే అని చెప్పొచ్చు. మీరు కూడా ఈ పజిల్‌ను మీ కుటుంబసభ్యులు, సన్నిహితులకు షేర్ చేసి.. వారు సరైన సమాధానం చెబుతారో లేదో చూడండి.




