Viral: ఈ స్విమ్మింగ్ పూల్‌కు నెలకు రూ. 22 లక్షల ఆదాయం.. అదెలాగో తెలిస్తే మైండ్‌పోతుంది

Viral: యూపీలోని మీరట్‌లో ఉన్న ఓ స్విమ్మింగ్ పూల్ వ్యాపారం నెలకు రూ. 22 లక్షలకు పైగా ఆదాయం గడిస్తోందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.

Ravi
By Ravi
Published on: 12 Jun 2026 8:23 PM IST
Viral
X

Viral: ఈ స్విమ్మింగ్ పూల్‌కు నెలకు రూ. 22 లక్షల ఆదాయం.. అదెలాగో తెలిస్తే మైండ్‌పోతుంది

Viral: యూపీలోని మీరట్‌లో ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్ వ్యాపారం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ పూల్ ద్వారా నెలకు ఏకంగా రూ. 22 లక్షల ఆదాయం వస్తోందని పూజా అనే కంటెంట్ క్రియేటర్ ఎక్స్ వేదికగా షేర్ చేసిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అసలేం జరిగిందంటే?

మీరట్‌లోని ఎన్‌హెచ్-58 హైవే పక్కన పూజా ఫ్రెండ్ ఒకరు వ్యవసాయ క్షేత్రంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశాడు. 'ఈ పూల్ ద్వారా ఏమైనా లాభాలు వస్తున్నాయా? లేదా కేవలం సరదాగా ఏర్పాటు చేశావా?' అని పూజా తన ఫ్రెండ్‌ను అడగ్గా, "పర్వాలేదు, వస్తున్నాయి" అని క్యాజువల్‌గా బదులిచ్చాడు. అయితే, ఈ బిజినెస్ మోడల్‌‌కు సంబంధించిన లెక్కలు అడిగి తెలుసుకున్న తర్వాత ఆమె ఆశ్చర్యపోయింది.

ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి నెలకు రూ. 22.5 లక్షల ఆదాయం వస్తోందని ఆమె పంచుకుంది. వేసవి సెలవుల సమయంలో, ఈ పూల్‌కు ప్రతిరోజూ 700 నుంచి 800 మంది సందర్శకులు వస్తుంటారు. సగటున 750 మంది అనుకున్నా, ఒక్కొక్కరి ఎంట్రీ ఫీజు రూ. 100 చొప్పున వేసుకుంటే, రోజువారీ ఆదాయం సుమారు రూ. 75,000 వరకు ఉంటుంది. ఇదే లెక్కన 30 రోజులకు లెక్కిస్తే సుమారు రూ. 22.5 లక్షల ఆదాయం వస్తుంది. ఇక వేసవి సీజన్ కాని రోజుల్లో కూడా రోజుకు కనీసం 250 మంది వస్తుంటారని, ఆ లెక్కన చూసినా రోజుకు రూ. 25,000 చొప్పున నెలకు రూ. 7.5 లక్షల ఆదాయం వస్తుంది.

ఖర్చులు, అదనపు ఆదాయం:

ఇక ఈ పూల్‌కి అద్దె ఖర్చు లేదని.. అది తన స్నేహితుడి సొంత స్థలం అని పూజా చెప్పుకొచ్చింది. ఇద్దరు సెక్యూరిటీ గార్డుల జీతం నెలకు రూ. 20,000 మాత్రమే ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా, పూల్ నుంచి తీసేసిన నీటిని వృధా చేయకుండా, పక్కనే ఉన్న రైతులకు సాగునిమిత్తం అమ్ముతూ అదనపు ఆదాయం కూడా సంపాదిస్తున్నాడని వివరించింది. కాగా, ఈ స్విమ్మింగ్ పూల్ ఆదాయంపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. కొంతమంది ఈ ఐడియా చాలా బాగుందని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం ఈ లెక్కలను తప్పుబడుతున్నారు.

రూ. 22 లక్షలు అనేది కేవలం వచ్చే ఆదాయం మాత్రమేనని, కరెంటు బిల్లులు, నిర్వహణ, నీటి శుద్ధి, ఇతర ఖర్చులన్నీ తీసేస్తే వచ్చే లాభం చాలా తక్కువగా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. అంతేకాక క్లోరిన్ కలిపిన పూల్ వాటర్‌ని వ్యవసాయానికి వాడలేరని కూడా కొందరు వాదిస్తున్నారు.


Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story