Viral News: సోషల్ మీడియాలో మారుతి 800 పాత బిల్ వైరల్.. 1984లో ఈ కారు ధర ఎంతో తెలుసా?

Maruti 800 Old Bill Viral News: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మారుతి సుజుకీ 800 పాత షోరూమ్ బిల్. 1984 మే నెలలో ఈ కారు ధర ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 May 2026 6:30 AM IST
Viral 1984 Maruti 800 Bill Shows ₹60,000 Price That Shocked Internet
X

Viral News: సోషల్ మీడియాలో మారుతి 800 పాత బిల్ వైరల్.. 1984లో ఈ కారు ధర ఎంతో తెలుసా?

Maruti 800 Old Bill Viral News: నేటి తరానికి మారుతి సుజుకీ 800 (Maruti Suzuki 800) కారు గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, ఒకప్పుడు భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసించిన రారాజు ఇది. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారతీయ రోడ్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని చవిచూసింది. మధ్యతరగతి కుటుంబాల కార్ల కలను నిజం చేసిన ఈ ఐకానిక్ కారుకు సంబంధించిన ఒక పాత షోరూమ్ బిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులోని ధర చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

1984 నాటి బిల్లులో ఏముందంటే?

వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. 1984 మే నెలలో కర్ణాటకకు చెందిన శ్యామ్ అనే వ్యక్తి 'ఆదిత్య డీలర్స్' నుండి ఈ మారుతి 800 కారును కొనుగోలు చేశారు. ఆ ఒరిజినల్ బిల్‌లో కారు ఎక్స్-షోరూమ్ ధర కేవలం 47,500 రూపాయలు మాత్రమే ఉంది! రోడ్ టాక్స్, ఇతర రిజిస్ట్రేషన్ ఖర్చులన్నీ కలుపుకుని మొత్తంగా ఆ కారు ఓనర్ చేతికి వచ్చేసరికి కేవలం 60,000 రూపాయలు మాత్రమే ఖర్చయింది. నేడు ఒక మంచి స్మార్ట్‌ఫోన్ ధరతో అప్పట్లో ఏకంగా కారే వచ్చేదన్నమాట!



2014లో ప్రొడక్షన్ బంద్.. ఇప్పటి ధరలు ఇవే!

1983లో ప్రారంభమైన మారుతి 800 ప్రయాణం మారుతున్న టెక్నాలజీ, సేఫ్టీ నిబంధనల కారణంగా 2014లో పూర్తిగా నిలిచిపోయింది.

2014లో చివరి ధర: ప్రొడక్షన్ ఆగిపోయే సమయానికి దీని బేస్ మోడల్ (Std Petrol) ధర రూ.2.06 లక్షలు కాగా, ఏసీ మోడల్ రూ.2.19 లక్షలు, ఎల్‌పీజీ వేరియంట్ (Duo LPG) ధర గరిష్టంగా రూ.2.42 లక్షల వరకు ఉండేది.

ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ మార్కెట్ ధర: ఒకవేళ మీరు ఇప్పుడు ఈ వింటేజ్ కారును సెకండ్ హ్యాండ్‌లో కొనాలనుకుంటే.. కారు కండిషన్, తిరిగిన కిలోమీటర్లను బట్టి మార్కెట్లో సుమారు రూ.45,000 నుండి రూ.75,000 వరకు లభిస్తోంది. అంటే 1984లో కొత్త కారు కొన్న ధరకే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కారు దొరుకుతోందని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story