Viral Video: వీడెవడ్రా బాబోయ్.. ఏకంగా కింగ్ కోబ్రాతోనే ఫైటింగ్‌కు దిగాడు!
Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక షాకింగ్ వీడియోలో.. ఒక వ్యక్తి పాముతో ఫైటింగ్‌కు దిగాడు.
Viral Video: వీడెవడ్రా బాబోయ్.. ఏకంగా కింగ్ కోబ్రాతోనే ఫైటింగ్‌కు దిగాడు!
Viral Video: సాధారణంగా పాము కనిపిస్తే చాలు ఎంతటి వారైనా భయంతో ఆమడ దూరం పారిపోతారు. కొందరైతే చీకట్లో తాడును చూసి కూడా కోబ్రా అనుకుని హడలిపోతారు. కానీ, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా రీల్స్, లైకుల పిచ్చితో కొందరు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాములతో ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఒక విస్తుపోయే వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.
ఓ పంట పొలం గట్టున ఒక వ్యక్తి ఏకంగా ఒక విషసర్పంతో ఫైటింగ్‌కు దిగాడు. సదరు వ్యక్తి పదే పదే ఆ పామును ఫుట్‌బాల్‌ను తన్నినట్లు కాలితో తన్నడం వీడియోలో కనిపిస్తోంది. అయితే, ఆ కోబ్రా కూడా ఏమాత్రం తగ్గకుండా అతడిపై పగ తీర్చుకోవాలన్నట్లు పదే పదే ఎదురుదాడికి దిగింది.
అతను ఎన్నిసార్లు కాలితో తన్ని నీళ్లలో పడేసినా.. ఆ పాము మళ్లీ మళ్లీ పైకి లేచి అతనిపైకి దూసుకొచ్చింది. ఇలా కొద్దిసేపటి వరకు ఆ వ్యక్తికి, కోబ్రాకు మధ్య హై ఓల్టేజ్ ఫైటింగ్ నడిచింది. చివరకు ఆ పాము అలసిపోయి.. 'వీడితో నాకెందుకులే' అనుకుందో ఏమో కానీ, మెల్లగా నీళ్లలో నుంచి పొలాల్లోకి జారుకుంది.
అక్కడ ఉన్న కొందరు ఈ దృశ్యాలను రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. "వీడేంట్రా బాబోయ్.. ఇంత వైలెంట్‌గా ఉన్నాడు", "రీల్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు" అంటూ కామెంట్లు పెడుతున్నారు.




