Viral Video: ట్రెక్కింగ్ చేస్తూ జారిపడ్డ యువకుడు.. చెట్టుకు చిక్కుకోకబోయి ఉంటే.. జరిగేదిదే!

Viral Video: మహారాష్ట్రలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన లోనావాలాలో ఒక యువకుడు టెక్కింగ్ చేస్తూ అదుపుతప్పి లోయలో పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తు ఒక చెట్టుపై చిక్కుకుని ప్రాణాలతో బయటపడగా, భారీ వర్షాల మధ్య రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అతన్ని రక్షించారు.

Ravi
By Ravi
Published on: 24 July 2026 9:34 PM IST
Viral Video
X

Viral Video: ట్రెక్కింగ్ చేస్తూ జారిపడ్డ యువకుడు.. చెట్టుకు చిక్కుకోకబోయి ఉంటే.. జరిగేదిదే!

Viral Video: వర్షాకాలంలో మహారాష్ట్రలోని లోనావాలా, ఖండాలా ప్రాంతాలు సుందరమైన ప్రకృతి దృశ్యాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. అయితే ఇదే సమయంలో కొండచరియలు విరిగిపడటం, జలపాతాల వద్ద ప్రమాదాలు జరగడం వంటి ఘటనలు కూడా తరచూ జరుగుతుంటాయి. తాజాగా లోనావాలా ప్రాంతంలో టెక్కింగ్ చేయడానికి వెళ్లిన ఒక యువకుడు ఊహించని ప్రమాదానికి గురయ్యాడు. కొండపై నడుస్తున్న సమయంలో కాలుజారి ప్రమాదవశాత్తు అంతుచిక్కని లోయలోకి పడిపోయాడు. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదంతో అక్కడ తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది.

అయితే ఆ అదృష్టవశాత్తు ఆ లోయలో ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మలపై ఆ యువకుడు పడి చిక్కుకుపోయాడు. నేరుగా అడుగున ఉన్న లోతులోకి పడిపోకుండా ఆ చెట్టు అతడి ప్రాణాలను కాపాడింది. ఆ సమయంలో భారీ వర్షాలు కురుస్తుండటం, చుట్టూ దట్టమైన మంచు ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం చాలా కష్టతరంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, యువకుడు చెట్టు కొమ్మలను గట్టిగా పట్టుకుని ప్రాణాల కోసం పోరాడుతున్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక రెస్క్యూ టీమ్‌లు, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

కాగా, కురుస్తున్న భారీ వర్షాలను లెక్కచేయకుండా రెస్క్యూ సిబ్బంది ఎంతో సాహసోపేతంగా వ్యవహరించి ఆ యువకుడిని సురక్షితంగా పైకి చేర్చారు. ప్రాణాలతో బయటపడిన ఆ యువకుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. వర్షాకాలంలో పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ప్రమాదకర ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. తక్షణ స్పందనతో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story