Viral Video: ఇదేందిది.! ఏకంగా నెలకు రూ. 1.31 లక్షల ఖర్చు.. ఎందుకో తెలిస్తే షాకే..
Viral Video: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జీవన వ్యయం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఒక ఐఐఎం గ్రాడ్యుయేట్ ఒంటరిగా ఉంటూ కేవలం ఒక్క నెలలో ఏకంగా రూ.1.31 లక్షలకు పైగా ఖర్చు పెట్టడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
Viral Video: ఇదేందిది.! ఏకంగా నెలకు రూ. 1.31 లక్షల ఖర్చు.. ఎందుకో తెలిస్తే షాకే..
Viral Video: దేశంలో అత్యంత ఖరీదైన నగరాలలో ముంబై ఎప్పుడూ ముందుంటుంది. ఇక్కడ ఇళ్ల అద్దెలు, నిత్యవసరాలు, ఇతర సేవలకు అయ్యే ఖర్చులు మామూలుగా ఉండవు. తాజాగా ఐఐఎం ఇండోర్ పూర్వ విద్యార్థిని, కార్పొరేట్ ఉద్యోగి అయిన నందిని సేథీ అనే యువతి ముంబైలో తన నెలవారీ ఖర్చుల వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం మరోసారి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆమె కొత్తగా అన్-ఫర్నిష్డ్ ఫ్లాట్‌లోకి మారిన తొలి నెలలోనే ఏకంగా రూ.1,31,277 ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఇందులో ఎలాంటి పెట్టుబడులు లేదా సేవింగ్స్ లేనప్పటికీ కేవలం జీవన వ్యయం కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు కావడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం, కొత్తగా అద్దెకు తీసుకున్న ఫ్లాట్ రెంట్ నెలకు రూ.31,000 కాగా, అది ఖాళీగా ఉండటంతో ఫర్నిచర్ కొనుగోలు చేయడానికి సుమారు రూ.25,000 ఖర్చయింది. వీటితో పాటు ఇంటి డీప్ క్లీనింగ్, ఏసీ ఇన్స్టాలేషన్, కిరాణా సామాగ్రి, రవాణా ఖర్చులు, వంట మనిషి అలాగే హౌస్ హెల్ప్ సర్వీసుల కోసం పెద్ద మొత్తంలో ఖర్చయినట్లు ఆమె వివరించింది. తన అనుభవాన్ని షేర్ చేస్తూ 'ముంబై నగరం ఇంత ఖరీదైనదిగా ఉండటం చూసి నేను ఇంకా నమ్మలేకపోతున్నాను, అసలు ఇక్కడ ఎందుకు జీవిస్తారో అర్థం కావడం లేదు' అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి రకరకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ముంబైలో జీవించడం అంటే నిజమైన ఎంబీఏ సర్వైవల్ స్కిల్స్ నేర్చుకోవడమేనని కొందరు కామెంట్లు చేస్తుండగా, మరికొందరు సొంతూర్లకు వెళ్లడమే ప్రశాంతమని సలహాలు ఇస్తున్నారు. మెట్రో నగరాల్లో ఉద్యోగాలు చేసే యువతకు పెరుగుతున్న జీవన వ్యయం ఏ స్థాయిలో భారంగా మారుతుందో ఈ ఉదంతం స్పష్టంగా తెలియజేస్తోంది.




