Black Cat: అక్కడ పెళ్లిరోజున నల్ల పిల్లి ఎదురొస్తే అంతా అదృష్టమే.! ఎందుకంటే.?
Black Cat: మన దేశంలో నల్ల పిల్లి ఎదురొస్తే అపశకునంగా భావిస్తారు. కానీ, ఇంగ్లండ్‌లో మాత్రం పెళ్లి రోజున నల్ల పిల్లి ఎదురైతే ఆ కొత్త జంటకు ఎంతో అదృష్టమని నమ్ముతారు.
Black Cat: అక్కడ పెళ్లిరోజున నల్ల పిల్లి ఎదురొస్తే అంతా అదృష్టమే.! ఎందుకంటే.?
Black Cat: మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు దారిలో పిల్లి, ముఖ్యంగా నల్ల పిల్లి ఎదురొస్తే వెంటనే ఆగిపోతాం. కనీసం ఒక పది నిమిషాలైనా ఆగి నీళ్లు తాగి మరీ వెళ్తుంటాం. నల్ల పిల్లి ఎదురవడం ఒక అపశకునంగా చాలామంది బలంగా నమ్ముతారు. కానీ, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రం నల్ల పిల్లిని అదృష్టానికి ప్రతీకగా భావిస్తారని మీకు తెలుసా?
మన దేశంలో నల్ల పిల్లిని చూసి భయపడితే.. ఇంగ్లండ్ పాత సంప్రదాయాల ప్రకారం మాత్రం నల్ల పిల్లి ఎదురు రావడం ఎంతో శుభసూచకంగా భావిస్తారు. అందులోనూ పెళ్లి రోజున వధూవరులకు నల్ల పిల్లి ఎదురైతే అంతకంటే అదృష్టం మరొకటి లేదని వారు నమ్ముతారు.
అక్కడి వారి నమ్మకం ప్రకారం.. పెళ్లి సమయంలో ఆ జంటకు నల్ల పిల్లి ఎదురుగా వస్తే, ఆ కొత్త జంట జీవితంలోకి భవిష్యత్తులో రాబోయే కష్టాలను, ప్రతికూల శక్తులను అది ముందే గ్రహిస్తుంది. అంతేకాకుండా, ఆ కష్టాలన్నింటినీ తనతో పాటు తీసుకెళ్లిపోతుందని వారు బలంగా విశ్వసిస్తారు. తద్వారా ఆ కొత్త జంట తమ జీవితాంతం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉంటారని ఇంగ్లండ్ ప్రజల నమ్మకం. మొత్తానికి మన దగ్గర భయం పుట్టించే నల్ల పిల్లి, మరో దేశంలో మాత్రం కొత్త జంటకు సుఖసంతోషాలు ఇచ్చే అదృష్టంగా మారడం నిజంగా విచిత్రమే.




