Viral News : ఫైవ్ స్టార్ రెస్టారెంట్లో షాకింగ్ సీన్.. శాండ్విచ్లో పురుగు
Viral News : ప్రముఖ రెస్టారెంట్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసి ఆహారం తినే పద్ధతి మెట్రో నగరాల్లో సాధారణమైంది. అయితే ఎంతటి పేరున్న రెస్టారెంట్ అయినా ఆహార
Viral-News
Viral News : ప్రముఖ రెస్టారెంట్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసి ఆహారం తినే పద్ధతి మెట్రో నగరాల్లో సాధారణమైంది. అయితే ఎంతటి పేరున్న రెస్టారెంట్ అయినా ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో నిరూపించే ఘటన ఇది. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న అత్యంత విలాసవంతమైన 'పాల్ రెస్టారెంట్' (Paul Restaurant) లో ఒక కస్టమర్ ఆర్డర్ చేసిన శాండ్విచ్లో సజీవంగా కదులుతున్న పురుగు ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది.
సగం శాండ్విచ్ తిన్నాక అసలు నిజం వెలుగులోకి
గురుగ్రామ్‌లోని పోష్ ఏరియాగా పేరుపొందిన వన్ హారిజన్ సెంటర్ (One Horizon Center) లో ఉన్న పాల్ రెస్టారెంట్‌కు ఒక వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఉదయం టిఫిన్ (Breakfast) కోసం వెళ్లాడు. అక్కడ వారు శాండ్విచ్ ఆర్డర్ చేశారు. సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ సగం శాండ్విచ్ తినేసిన తర్వాత, మిగిలిన భాగంలో ఏదో కదులుతున్నట్లు ఆ కస్టమర్ గమనించాడు. దగ్గరగా చూసి పరిశీలించగా, బ్రెడ్ ముక్కల మధ్య ఒక తెల్లటి పురుగు సజీవంగా కదులుతూ కనిపించడంతో అతను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్.. కస్టమర్ ఆగ్రహం
ఈ దారుణాన్ని చూసి కోపోద్రిక్తుడైన కస్టమర్, శాండ్విచ్లో పురుగు కదులుతున్న దృశ్యాలను తన ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా నెట్టింట తీవ్రస్థాయిలో వైరల్ కావడంతో సదరు రెస్టారెంట్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన సంచలనంగా మారడంతో పాల్ రెస్టారెంట్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇది దురదృష్టకర సంఘటన అని పేర్కొంటూ బాధితుడికి క్షమాపణలు తెలిపింది. స్టోరేజ్ లేదా తయారీ విధానంలో ఏవైనా లోపాలు జరిగాయా అనే కోణంలో అంతర్గత విచారణ ప్రారంభించామని ప్రకటించింది. అయితే, రెస్టారెంట్ ఇచ్చిన ఈ వివరణను బాధితుడు తీవ్రంగా తిరస్కరించాడు. తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి యాజమాన్యం ఇలాంటి రొటీన్ ప్రకటనలు చేస్తోందని మండిపడ్డాడు.
పరిశుభ్రతా ప్రమాణాలపై ప్రశ్నలు.. రంగంలోకి ఆహార భద్రతా శాఖ
అత్యంత ఖరీదైన, పోష్ ప్రాంతంలో ఉన్న ఫైవ్ స్టార్ స్థాయి రెస్టారెంట్లో ఇలాంటి ఘటన జరగడం పట్ల వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ పరిశుభ్రత (Hygiene), ఆహార తయారీ ప్రమాణాలను (SOPs) గాలికి వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం తీవ్రరూపం దాల్చడంతో హర్యానా ప్రభుత్వ ఆహార భద్రతా శాఖ (Food Safety Department) రంగంలోకి దిగనుంది. సదరు రెస్టారెంట్‌పై ఆహార భద్రతా చట్టాల ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు తనిఖీలకు సిద్ధమవుతున్నారు.




