Viral Video : పశువుల కాపరిపై సింహం దాడి.. గుండెలు గుబేల్..
Viral Video : గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఒక పశువుల కాపరిపై ఆసియా సింహం అత్యంత భయానకంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనికి
lion-attack
Viral Video : గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఒక పశువుల కాపరిపై ఆసియా సింహం అత్యంత భయానకంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడ్డారు. పాలితానా తాలూకాలోని గర్జియా గ్రామంలో ఆదివారం ఉదయం ఈ ఘోర ఉదంతం చోటుచేసుకుంది.
నిలువునా పంజా విసిరిన మృగరాజు
గ్రామానికి చెందిన కాలుభాయ్ బొగ్భాయ్ గమరా అనే పశువుల కాపరి ఆదివారం ఉదయం తన ఇంటి వద్ద ఉన్న సమయంలో ఒక సింహం ఒక్కసారిగా అడవి నుంచి వచ్చి అతనిపైకి దూకింది. వైరల్ అవుతున్న వీడియోలో సింహం ఆ వ్యక్తిని కిందపడేసి, నోటితో గట్టిగా పట్టుకుని వదలకుండా హింసించడం కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు గమనించి గట్టిగా కేకలు వేస్తూ, సింహంపైకి రాళ్లు రువ్వినప్పటికీ అది బాధితుడిని వదిలిపెట్టలేదు. ఈ ఘోర పోరాటంలో సింహం ఆ కాపరి కాలును నోటితో బలంగా కొరకడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి..
గ్రామస్తులు ప్రాణాలకు తెగించి చేసిన ప్రయత్నాల తర్వాత సింహం ఎట్టకేలకు బాధితుడిని వదిలిపెట్టి అక్కడి నుంచి పొదల్లోకి పారిపోయింది. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న కాలుభాయ్‌ను స్థానికులు వెంటనే పాలితానా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి కాస్త విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం అధికారులు భావ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం అక్కడ అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
రంగంలోకి అటవీ శాఖ
ఈ ఘోర ఉదంతంపై సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు గర్జియా గ్రామానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పాలితానా అటవీ అధికారి చిరాగ్ అమిన్ స్పందిస్తూ, దాడికి పాల్పడిన ఆ వన్యమృగాన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని, గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు. గత కొంతకాలంగా అడవుల సరిహద్దుల్లో మానవ-వన్యప్రాణుల మధ్య ఘర్షణలు పెరుగుతుండటం, ఇప్పుడు ఏకంగా గ్రామంలోని ఇంటిపైనే సింహం దాడి చేయడంతో గర్జియా , చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు.
LION ATTACKS ON ANIMAL CARE TAKER 🚨
— Jeet (@JeetN25) July 6, 2026
A lioness attacked a Maldhari family near Palitana in Gujarat's Bhavnagar district.
- Lion trapped the guy for 30 minutes😨
- Look at the guy how he consoles Lion by Touching his head 😭
- After being rescued and rushed to a hospital for… pic.twitter.com/gWYDg9AYkX




