Girl Offers Cigarette: లైక్స్ కోసం ఇంత దిగజారాలా? తండ్రి ఫోటో ముందు సిగరెట్ నైవేద్యం
Girl Offers Cigarette: సోషల్ మీడియా లైక్స్ కోసం చనిపోయిన తండ్రి ఫోటో ముందు సిగరెట్ వెలిగించి పెట్టిన యువతి.
Girl Offers Cigarette: లైక్స్ కోసం ఇంత దిగజారాలా? తండ్రి ఫోటో ముందు సిగరెట్ నైవేద్యం
Cigarette as Naivedyam: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కాస్త పాపులారిటీ రావాలే కానీ.. జనాలు ఏది పడితే అది చేస్తున్నారు. వ్యూస్, లైక్స్ పిచ్చితో కనీస విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను కూడా పక్కనపెట్టేస్తున్నారు. తాజాగా ఓ యువతి తన చనిపోయిన తండ్రి వర్ధంతి సందర్భంగా చేసిన వింత ప్రయోగం ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపుతోంది. సాధారణంగా మన సంప్రదాయం ప్రకారం.. చనిపోయిన కుటుంబ సభ్యులను తలుచుకుంటూ, వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను ఫోటో ముందు నైవేద్యంగా పెట్టి మొక్కుకుంటారు. దీని వెనుక ఒక సెంటిమెంట్, నమ్మకం దాగి ఉన్నాయి.
అయితే, ఈ మధ్యకాలంలో కొంతమంది సోషల్ మీడియా అటెన్షన్ కోసం ఈ సెంటిమెంట్‌ను కూడా వాడుకుంటున్నారు. గతంలో ఒక యువకుడు తన తండ్రి ఫోటో ముందు రకరకాల బ్రాండ్ల మద్యం సీసాలను పేర్చి నైవేద్యంగా పెట్టడం వైరల్ కాగా.. ఇప్పుడు మరో యువతి అంతకంటే ఒక అడుగు ముందుకు వేసి అందరినీ షాక్‌కు గురిచేసింది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. సదరు యువతి తన తండ్రి ఫోటో ముందు ఆహారంతో పాటు ఒక సిగరెట్‌ను కూడా నైవేద్యంగా పెట్టింది. అంతటితో ఆగకుండా, తానే స్వయంగా ఆ సిగరెట్‌ను నోట్లో పెట్టుకుని, వెలిగించి, పొగ వస్తూ ఉండగానే దానిని తండ్రి ఫోటో వద్ద స్టాండ్‌లో పెట్టింది.
ఇక ఈ వీడియోకు ఆమె పెట్టిన క్యాప్షన్ చూసి నెటిజన్ల మైండ్ బ్లాంక్ అవుతోంది. "నాన్న.. నువ్వు అక్కడ రంభ, మేనక, ఊర్వశిలతో చిల్ అవుతున్నావని అనుకుంటున్నా. వారికి కూడా కాస్త ఫెమినిజం గురించి నేర్పిస్తావని ఆశిస్తున్నా.." అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ అవ్వడమే ఆలస్యం.. నెటిజన్లు సదరు యువతిపై బూతులతో విరుచుకుపడుతున్నారు.
తండ్రిపై ప్రేమను చూపించడానికి ఇదా పద్ధతి? అని కొందరు ప్రశ్నిస్తుంటే.. కేవలం కొన్ని వ్యూస్, లైక్స్ కోసం కన్నతండ్రిని, సంస్కృతిని ఇలా బజారున పడేస్తారా? అంటూ మరికొందరు మండిపడుతున్నారు. పాపులారిటీ కోసం కన్నవారి పరువును, సంప్రదాయాలను ఇలా సోషల్ మీడియాలో తాకట్టు పెట్టడంపై సమాజంలో తీవ్ర చర్చ నడుస్తోంది.




