Happy Friendship Day 2026 : మీ బెస్ట్ ఫ్రెండ్‌కు ఇలా విష్ చేస్తే.. జీవితాంతం గుర్తుంచుకుంటారు

Happy Friendship Day 2026 : భారత్‌లో ఫ్రెండ్‌షిప్ డే 2026 ఆగస్టు 2న (ఆదివారం) జరుపుకుంటారు. యూఎన్ జులై 30న గుర్తించినా, ఇండియాలో ఆగస్టు 2నే జరుపుకోవడం ఆనవాయితీ.

CR Reddy
Published on: 1 Aug 2026 9:03 PM IST
Happy Friendship Day 2026
X

Happy Friendship Day 2026

Happy Friendship Day 2026 : జీవితంలో మనం ఎన్నో బంధాలను చూస్తాం. కానీ ఎలాంటి స్వార్థం లేకుండా మన నవ్వుల్లో, బాధల్లో, విజయాల్లో, అపజయాల్లో మనతో పాటు నడిచేది నిజమైన స్నేహితుడే. అందుకే ప్రతి ఏడాది ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్‌షిప్ డేను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ రోజు చిన్ననాటి స్నేహితుడు, స్కూల్ ఫ్రెండ్, కాలేజ్ బెస్ట్ ఫ్రెండ్, ఆఫీస్ కొలీగ్, జీవితంలో ఎప్పుడూ అండగా నిలిచిన ప్రియమైన స్నేహితులకు ఒక మంచి మెసేజ్ పంపి మీ ప్రేమను తెలియజేసే ప్రత్యేక సందర్భం.

ఈసారి ఫ్రెండ్‌షిప్ డే ఆగస్టు 2వ తేదీన అంటే ఆదివారం నాడు వచ్చింది. అయితే గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు జులై 30 అని చూపించడంతో చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. నిజానికి ప్రపంచంలో రెండు ఫ్రెండ్‌షిప్ డేలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి 2011లో అధికారికంగా జులై 30ని ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డేగా ప్రకటించింది. కానీ దానికి దశాబ్దాల ముందే భారత్, అమెరికా, ఇతర దక్షిణాసియా దేశాలు ఆగస్టు నెలలోని మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్‌షిప్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నాయి. కాబట్టి జులై 30 యుఎన్ క్యాలెండర్ ప్రకారం అయితే, మన దేశంలో మాత్రం ఆగస్టు 2నే ఫ్రెండ్‌షిప్ డేగా ఘనంగా జరుపుకుంటారు.

ఆదివారం నాటి సంప్రదాయం ఎక్కడ మొదలైంది?

ఈ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1930లో అమెరికాకు చెందిన హాల్‌మార్క్ గ్రీటింగ్ కార్డ్స్ అధినేత జాయిస్ హాల్ తొలిసారిగా ఆగస్టు 2న స్నేహితుల రోజుగా జరుపుకోవాలనే ఆలోచనను తెచ్చాడు. ఆ తర్వాత 1958లో పరాగ్వే దేశానికి చెందిన డాక్టర్ రమోన్ ఆర్టెమియో బ్రాచో అనే వైద్యుడు దేశాల మధ్య, ప్రజల మధ్య శాంతి-సౌభ్రాతృత్వాలను పెంపొందించడానికి స్నేహం ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి దీనికి ప్రచారం కల్పించారు. అమెరికాలో కాలక్రమేణా ఈ క్రేజ్ తగ్గినప్పటికీ, ఆసియా దేశాలలో మాత్రం ఇది ఒక పెద్ద సంస్కృతిగా రూపాంతరం చెందింది.

ఇండియాలో ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ల ట్రెండ్

భారతదేశంలో ఫ్రెండ్‌షిప్ డే ఈ స్థాయిలో పాపులర్ కావడానికి ప్రధాన కారణం బాలీవుడ్ క్లాసిక్ సినిమా కుచ్ కుచ్ హోతా హై(1998). షారుఖ్ ఖాన్, కాజోల్ నటించిన ఈ సినిమాలో స్నేహానికి గుర్తుగా చేతికి కట్టుకునే ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కాన్సెప్ట్‌ను చూపించారు. ఈ సినిమా దెబ్బకు 90ల నాటి టీనేజర్లు, స్కూల్, కాలేజీ విద్యార్థులు ఒకరికొకరు కలర్‌ఫుల్ బ్యాండ్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. 2000ల ప్రారంభం నాటికి ఇది భారతదేశంలో ఒక పండుగలా మారిపోయింది. కార్డ్స్ కంటే కూడా ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లే మన దగ్గర ప్రధాన చిహ్నంగా నిలిచాయి.

స్నేహితులు ఈ రోజును ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారు?

ఫ్రెండ్‌షిప్ డే జరుపుకోవడానికి పెద్దగా ప్లానింగ్స్ అవసరం లేదు, స్నేహితులు కలవడమే ఒక పెద్ద పండుగ. స్కూళ్లు, కాలేజీల నుంచి ప్రారంభించి ఆఫీసుల్లో పనిచేసే సహోద్యోగుల వరకు అందరూ చేతికి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు కట్టుకుంటారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పాత జ్ఞాపకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకుంటారు. ఆదివారం కావడంతో ఫ్రెండ్స్ అందరూ కలిసి కెఫేలకు వెళ్లడం, సినిమాలు చూడటం లేదా సుదీర్ఘమైన కబుర్లతో సమయాన్ని గడపడం చేస్తారు. కేవలం బహుమతులే కాకుండా మనస్ఫూర్తిగా చెప్పుకునే మాటలు, పంపే సందేశాలు స్నేహ బంధాన్ని మరింత బలపరుస్తాయి.

బెస్ట్ ఫ్రెండ్‌కు హార్ట్ టచింగ్ కోట్స్

* నాకు దొరికిన గొప్ప సంపద డబ్బు కాదు... నీలాంటి నిజమైన స్నేహితుడు.

* స్నేహం అంటే రక్త సంబంధం కాదు... మనసులు కలిసే బంధం.

* ప్రపంచం మొత్తం దూరమైనా... నిజమైన స్నేహితుడు మాత్రం ఎప్పుడూ నీ పక్కనే ఉంటాడు.

* నిజమైన స్నేహితుడు నీ విజయానికి చప్పట్లు కొడతాడు... అపజయంలో నీ భుజం తడుముతాడు.

* దూరం శరీరాలను మాత్రమే వేరు చేస్తుంది... నిజమైన స్నేహాన్ని కాదు.

* నువ్వు నవ్వితే నా రోజు అందంగా మారుతుంది... అదే స్నేహం గొప్పతనం.

* స్నేహం ఒక బంధం కాదు... జీవితాంతం నిలిచే నమ్మకం.

* నీ స్నేహం నాకు దైవం ఇచ్చిన అందమైన బహుమతి.

* ప్రతి ఒక్కరికీ స్నేహితులు ఉంటారు... కానీ జీవితాన్ని మార్చే స్నేహితుడు కొందరికే దొరుకుతాడు.

* జీవితంలో ఎన్నో విజయాలు వస్తాయి... కానీ నీలాంటి స్నేహితుడు ఒక్కరే దొరుకుతాడు.

* స్నేహం ఉన్న చోటే నిజమైన ఆనందం ఉంటుంది.

* నిజమైన ఫ్రెండ్ ఉంటే జీవితం ఎప్పుడూ ఒంటరిగా అనిపించదు.

* నా బలం... నా స్నేహితులు.

* స్నేహం కాలంతో కాదు... మనసుతో నిలుస్తుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story